JP Nadda | వాళ్లు వర్చువల్ మీటింగ్స్ మాత్రమే నిర్వహించగలరు.. INDIA కూటమిపై జేపీ నడ్డా సెటైర్స్..!
JP Nadda | వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (NDA) ను ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న ‘INDIA’ కూటమిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సెటైర్లు వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు శనివారం ఉదయం ‘INDIA’ పార్టీల నేతలు వర్చువల్ విధానంలో సమావేశం కావడాన్ని నడ్డా ఎద్దేవా చేశారు. ‘వర్చువల్ కూటమి వర్చువల్ సమావేశాలు మాత్రమే నిర్వహించగలదు’ అని ఆయన ఎగతాళి చేశారు.
JP Nadda: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (NDA) ను ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న ‘INDIA’ కూటమిపై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సెటైర్లు వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు శనివారం ఉదయం ‘INDIA’ పార్టీల నేతలు వర్చువల్ విధానంలో సమావేశం కావడాన్ని నడ్డా ఎద్దేవా చేశారు. ‘వర్చువల్ కూటమి వర్చువల్ సమావేశాలు మాత్రమే నిర్వహించగలదు’ అని ఆయన ఎగతాళి చేశారు.
ప్రతిపక్ష INDIA కూటమి నేతలందరిదీ రెండు అంశాల ఎజెండా అని నడ్డా విమర్శించారు. వారి కుటుంబాలను, ఆస్తులను కాపాడుకోవడమే వారికి ముఖ్యమని ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన బీజేవైఎం మీటింగ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశ అభివృద్ధి.. యువత, రైతులు, మహిళల సాధికరత.. పేదరిక నిర్మూలన కోసం ప్రధాని మోదీ పనిచేస్తుంటే.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ప్రధాని మోదీని గద్దె దించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆయన మండిపడ్డారు.
కరుణానిధి, ప్రకాశ్‌సింగ్ బాదల్ ఇప్పుడు లేరని, వాళ్లు ఎల్లప్పుడూ తమ పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసమే ఆరాటపడ్డారని జేపీ నడ్డా ఆరోపించారు. ఇప్పుడు మమతాబెనర్జి, శరద్‌పవార్, ఫరూఖ్ అబ్దుల్లా, ఎంకే స్టాలిన్ తదితరులు కూడా తమ వారసుల కోసమే తాపత్రయపడుతున్నారని విమర్శించారు. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తన భార్య, లోక్‌సభ సభ్యురాలు డింపుల్ యాదవ్ పొలిటికల్ ఫ్యూచర్ కోసం ఆరాటపడటం లేదా..? అని ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేతల్లో చాలామందిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని.. వారంతా సీబీఐ, ఈడీ దర్యాప్తులను ఎదుర్కొంటున్నారని నడ్డా తెలిపారు. పైగా ఆ అవినీతిపరులంగా దర్యాప్తు సంస్థలపైనే దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ కూడా బెయిల్‌పై బయట తిరుగున్నారని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

