బెంగళూర్ : బయోకాన్ అధిపతి కిరణ్ మజుందార్ షా ఇంట విషాదం నెలకొంది. కిరణ్ షా భర్త జాన్ షా (73) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బయోకాన్ లిమిటెడ్ మాజీ వైస్ చైర్మన్, కిరణ్ మజుందార్ షా భరత్ జాన్ షా మరణించారని తెలిపేందుకు విచారిస్తున్నామని కిరణ్ షా కార్యాలయం మంగళవారం ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
బయోకాన్ చీఫ్ కిరణ్ షా కూడా ట్విట్టర్లో ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. జాన్ నీ ఆత్మకు శాంతి చేకూరాలి..నా జీవితాన్ని ప్రత్యేకంగా మలిచినందుకు నీకు ధన్యవాదాలు..మిమ్మల్ని మేం మిస్ అవుతున్నామని జాన్ షాతో తాను కలిసున్న ఫోటోను ఆమె షేర్ చేశారు.
బెంగళూర్‌లోని విల్సన్ గార్డెన్ స్మశానవాటికలో జాన్ షా అంత్యక్రియలు నిర్వహించారు. 1999 నుంచి జాన్ బయోకాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో కొనసాగుతున్నారు. కొలెస్ట్రాల్‌ను తగ్గించే మందుకు 2001లో యూఎస్ఎఫ్డీఏ ఆమోదం పొందిన తొలి భారతీయ కంపెనీగా బయోకాన్ నమోదైంది.