JK Elecions | పోలింగ్ కేంద్రం ఆవరణలో మొక్కలు నాటిన ఓటర్లు.. Video
JK Elecions | జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో గండేర్బల్ నియోజకవర్గం బాగూ రాంపొరాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటేసిన తొలి ముగ్గురు ఓటర్లు ఆ పోలింగ్ కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు.
JK Elecions : జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో గండేర్బల్ నియోజకవర్గం బాగూ రాంపొరాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటేసిన తొలి ముగ్గురు ఓటర్లు ఆ పోలింగ్ కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. ముగ్గురు మూడు మొక్కలు నాటి పర్యావరణ స్ఫూర్తిని చాటారు.
#WATCH | J&K Assembly elections: First three voters at a polling station in Bagoo Rampora of Ganderbal constituency, plant saplings after casting their vote.
JKNC vice president Omar Abdullah is contesting from here where he is facing a contest from PDP’s Bashir Ahmad Mir. pic.twitter.com/69S7MYpyS1
— ANI (@ANI) September 25, 2024
గండేర్బల్ అసెంబ్లీ స్థానం నుంచి జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత ఒమర్ అబ్దుల్లా బరిలో ఉన్నారు. ఆయనతో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బషీర్ అహ్మద్ తలపడుతున్నారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతన్నాయి. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఈ నెల 18 తొలి విడత ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. ఇవాళ (బుధవారం) రెండో విడత పోలింగ్ జరుగుతోంది. అక్టోబర్ 1న మూడో విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. జమ్ముకశ్మీర్‌లోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకుగాను తొలి విడతలో 24 స్థానాలకు పోలింగ్ జరిగింది. రెండో విడతలో 26 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది.
మూడో విడతలో 40 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటే అక్టోబర్ 8న జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా వెల్లడించనున్నారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

