COVID Variant Eris | మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఎరిస్ భారత్‌లోనూ విజృంభిస్తోందా?
COVID Variant Eris | బ్రిటన్ను భయపెట్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు భారత్‌లో కూడా విజృంభిస్తోంది. యూకేలో విస్తృతంగా వ్యాపిస్తున్న ఎరిస్ (EG.5.1) అని పిలిచే ఈ వేరియంట్ కేసులు మహారాష్ట్రలో కూడా గణనీయంగా పెరుగుతున్నాయి.
COVID Variant Eris | బ్రిటన్ను భయపెట్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఇప్పుడు భారత్‌లో కూడా విజృంభిస్తోంది. యూకేలో విస్తృతంగా వ్యాపిస్తున్న ఎరిస్ (EG.5.1) అని పిలిచే ఈ వేరియంట్ కేసులు మహారాష్ట్రలో కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో జూలై చివరినాటికి 70 యాక్టివ్ కేసులు ఉండగా.. ఆగస్టు 6 నాటికి ఆ సంఖ్య 115కు చేరింది. నిన్న ఆ సంఖ్య 106కి తగ్గింది. అయితే వీటిలో అత్యధిక కేసులు ముంబైలో నమోదయ్యాయి. ముంబైలో 43, పుణెలో 34, థానేలో 25 కేసులు నమోదయ్యాయి. రాయ్‌గడ్, సంగ్లీ, షోలాపూర్, సతారా, పాలఘఢ్లో ఒక్కో కొవిడ్-19 కేసు బయటపెడింది.
ఒక్కసారిగా కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి.. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. కేసులు పెరిగినంత మాత్రాన కొత్త వేరియంట్ విజృంభిస్తుందని అప్పుడే నిర్ధారించలేమని స్పష్టం చేశారు. ఒక వారం పాటు నమోదైన కేసులను పరిశీలించిన తర్వాతనే దీనిపై క్లారిటీ ఇవ్వగలమని పేర్కొన్నారు. సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో శ్వాస కోశ సమస్యలు ఎక్కువగా ఉంటాయని ఆయన తెలిపారు. నాలుగు ఐదు రోజులుగా కొవిడ్ కేసులు కూడా అధికంగానే నమోదవుతున్నాయని చెప్పారు. ఎరిస్ వేరియంట్ తొలిసారిగా మే నెలలో బయటపడిందని మహారాష్ట్రలోని బీజే మెడికల్ కాలేజీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్త రాజేశ్ కార్యకర్తె తెలిపారు. అయితే అప్పటినుంచి ఇప్పటిదాకా కేసుల్లో గణనీయ పెరుగుదల మాత్రం లేదని స్పష్టం చేశారు.
ఇవీ లక్షణాలు :
ఒమిక్రాన్ వేరియంట్ కొన్ని జన్యు మార్పులు సంతరించుకోవడం ద్వారా ఈ న్యూ వేరియంట్ ఉత్పన్నమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో కనిపించిన వ్యాధి లక్షణాలే.. ఇంచుమించుగా ఈ కొత్త వేరియంట్ సంక్రమించిన వారిలో కూడా కనిపిస్తున్నాయని తెలిపారు. సాధారణంగా ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో ముక్కు కారడం, తీవ్రమైన తల నొప్పి, గొంతు నొప్పి, తుమ్ములు, ఆయాసం లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని, కొత్త వేరియంట్ ఎరిస్ సోకిన వారిలో ఈ లక్షణాలే కామన్‌గా ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. ప్రస్తుతం బ్రిటన్‌లో ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ కొవిడ్ కేసులే ఉన్నాయని, ఆ తర్వాత ఎరిస్ వేరియంట్ కొవిడ్ కేసులదే రెండో స్థానమని వారు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Coronavirus
- EG.5.1
- eris
- Health
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

