Inter Caste Marriages: కులాంతర వివాహాలను నిరోధించలేం: కేరళ సీఎం విజయన్
Inter Caste Marriages: ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీలను అడ్డుకోలేమని కేరళ సీఎం విజయన్ తెలిపారు. అలాంటి పెండ్లిళ్లు ఈ రాష్ట్రంలో జరుగుతున్న మార్పులో భాగమే అని అన్నారు. వామపక్ష విద్యార్థి సంఘాలకు అలాంటి వివాహాలతో లింకు లేదని ఆయన స్పష్టం చేశారు.
కొచ్చి: కులాంతర వివాహాల(Inter-caste marriages)ను నిరోధించలేమని, అవి ఈ రాష్ట్రంలో జరుగుతున్న మార్పులో భాగమే అని కేరళ సీఎం విజయన్ అన్నారు. కోజికోడ్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక యువకుడు, ఒక యువతి.. ఒకర్ని ఒకరు ఇష్టపడి.. పెళ్లి చేసుకోవాలనుకుంటే, వారి కులం, మతంతో సంబంధం లేకుండా, ఆ బంధాన్ని ఎవరూ అడ్డుకోలేరని విజయన్ అన్నారు. కులాంతర వివాహాలకు ఎప్పుడూ పేరెంట్స్ నుంచే వ్యతిరేకత వస్తూనే ఉందని, కానీ ఎప్పుడు కూడా అలాంటి పెండ్లిళ్లు ఆగలేదని ఆయన అన్నారు.
సీపీఎంతో పాటు ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాలు.. కులాంతర, మతాంతర విహాలను ప్రోత్సహిస్తున్నట్లు ఇటీవల ఆ రాష్ట్రానికి చెందిన ఓ ఇస్లామిక్ గురువు ఆరోపించారు. సెక్యులరిజం పేరుతో ఆ పెండ్లిళ్లు జరిపిస్తున్నట్లు విమర్శించారు. దీనిపై విజయన్ స్పందిస్తూ.. ఎస్ఎఫ్ఐ కానీ, డీవైఎఫ్ఐ కానీ.. కులాంతర వివాహాలకు బ్యూరోలుగా వ్యవహరించడంలేదన్నారు. ఈ మార్పులన్నీ కాలానుగుణం జరుగుతున్నట్లు చెప్పారు. ఏ సంస్థ కానీ, ప్రభుత్వం కానీ ఇలాంటి వివాహాలను ప్రోత్సహించడం లేదన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
Adilabad Rims Hospital | ఆదిలాబాద్ రిమ్స్‌లో శిశువు మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన.. వీడియో
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Victory | గుండెపోటుతో మృతి చెందిన ఎంపీటీసీ అభ్యర్థి విజయం
‘యువత డ్యాన్స్ ప్రతిభకు సువర్ణావకాశం’
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

