40 ఏళ్లు దాటినవాళ్లకు బూస్టర్ డోసు ఇవ్వండి..

న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన నేపథ్యంలో .. 40 ఏళ్ల వయసు దాటిన వారికి బూస్టర్ డోసు టీకాలు ఇవ్వాలని జీనోమ్ పరిశోధనల గ్రూపు ఇన్సాకాగ్ కేంద్రానికి సూచించింది. కరోనా వైరస్‌లో జరుగుతున్న జన్యు పరిణామాలను పరిశీలిచేందుకు 28 పరిశోధనశాలలతో కూడిన కన్సార్టియం ఏర్పడిన విషయం తెలిసిందే. తన వీక్లీ బులిటెన్‌లో ఇన్సాకాగ్ ఈ సిఫారసు చేసింది. వ్యాక్సిన్ వేసుకోని వారికి ముందుగా టీకాలు ఇవ్వాలని, ఆ తర్వాత 40 ఏళ్లు ఉన్నవాళ్లకు, దాటినవాళ్లకు కోవిడ్ బూస్టర్ డోసు టీకాలు ఇవ్వాలని ఇన్సాకాగ్ తెలిపింది. ఎక్కువ రిస్క్ ఉన్నవారికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలని, ఇప్పుడున్న వ్యాక్సిన్లలో తక్కువ స్థాయి యాంటీబాడీలు ఉన్నాయని, వాటితో ఒమిక్రాన్‌ను నిర్వీర్యం చేయడం కుదరదని, అందుకే బూస్టర్ డోసు తప్పనిసరి అని ఇన్సాకాగ్ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

