న్యూఢిల్లీ: భారతీయుల సగటు ఆయుర్దాయం పెరిగింది. పాకిస్థాన్ కంటే భారత్ ముందంజలో ఉండగా, బంగ్లాదేశ్ కొంత మెరుగైన స్థాయిలో ఉంది. డబ్ల్యూహెచ్వో గణాంకాల ప్రకారం 2023లో భారత్లో పుట్టిన శిశువు సగటున 71 ఏండ్లు జీవించే అవకాశం ఉంది.
పాకిస్థాన్లో సగటు జీవిత కాలం 68.2 ఏండ్లుగా, బంగ్లాదేశ్లో ఇది 72.2 ఏండ్లుగా ఉంది. పాకిస్తాన్తో పోలిస్తే భారతీయుల ఆయుర్దాయం ఎక్కువగా ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్ కంటే సుమారు 1.2 ఏండ్లు తక్కువగా ఉంది.