Covid Vaccine | పూర్తిగా కోవిడ్ కట్టడి.. సిద్ధమవుతున్న ఉమ్మడి టీకా..!
Covid Vaccine | అన్ని కొవిడ్-19 వేరియంట్ల కట్టడితో మానవాళి రక్షణకు టీకా అభివృద్ధి చేస్తున్నట్లు ఇండియన్ శాస్త్రవేత్తలు తెలిపారు.
Covid Vaccine | అన్ని రకాల ప్రాణాంతక కరోనా వేరియంట్ల ఆట కట్టించేందుకు సమర్థవంతమైన వ్యాక్సిన్ తయారు చేయనున్నట్లు మన శాస్త్రవేత్తలు ప్రకటించారు. రెండేండ్ల క్రితం వెలుగు చూసిన కోవిడ్-19 మహమ్మారి ప్రపంచ మానవాళిని వణికించింది. అత్యంత ప్రమాదకర అంటువ్యాధి కోవిడ్-19 న్యూ వేరియంట్లతో దూసుకొస్తున్న తాజా వేవ్‌లతో పరిస్థితి విషమించకుండా చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆ శాస్త్రవేత్తలు తెలిపారు. భవిష్యత్‌లో వచ్చే అన్ని రకాల కరోనా వేరియంట్ల నుంచి రక్షణ కోసం టీకా రూపొందించాలని కాజీ నజ్రూల్ యూనివర్సిటీ (అసాన్సోల్), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (భువనేశ్వర్) సంస్థల శాస్తవ్రేతలు చెప్పారు.
పెప్టైడ్ అనే పేరుతో ఈ టీకా రూపొందించనున్నారు. ఇందులో రెండు కంటే ఎక్కువ అమైనో యాసిడ్స్ ఉంటాయి. వారు చేసిన పరిశోధన మాలిక్యూలర్ లిక్విడ్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. సార్స్-కోవ్-2తోపాటు హెచ్-కోవ్-229ఈ, హెచ్-కోవ్-హెచ్‌కేయూ1, హెచ్కోవ్-ఓసీ 43, సార్స్ కోవ్, మెర్స్-కోవ్ వేరియంట్ల నుంచి రక్షణ కల్పించేలా ఈ వ్యాక్సిన్ రూపొందించారు. తాము డిజైన్ చేసిన టీకా అత్యంత సుస్థిరంగా, యాంటిజెనిక్గా, ఇమ్యూనైజిక్గా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిశోధనలో కాజీ నజ్రూల్ యూనివర్సిటీకి చెందిన అభిగ్యాన్ చౌదరి, సుప్రభాత్ ముఖర్జీ, ఐఐఎస్ఈఆర్ నుంచి పార్థ్ సారథి సేన్ గుప్తా, సరోజ్ కుమార్ పాండా, మలాయ్ కుమార్ రాణా పాల్గొన్నారు.
కంప్యూటేషనల్ మెథడ్స్‌తో తమ టీం వ్యాక్సిన్‌ను డెవలప్చేసిందని అభిగ్యాన్ చౌదరి తెలిపారు. తదుపరి దశలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడంతోపాటు టెస్టింగ్ ప్రక్రియకు వెళుతుందన్నారు. ఈ వ్యాక్సిన్ తరహాలో మరే టీకాకు కూడా ఒకేసారి కరోనా ఫ్యామిలీ వైరస్‌లను కట్టడి చేసే సామర్థ్యం ఉండదని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

