న్యూఢిల్లీ: ‘రైలు గార్డు’ అని అనొద్దని, ఇకపై ‘ట్రైన్ మేనేజర్’గా పిలువాలని రైల్వే తెలిపింది. ‘గార్డ్’ పోస్ట్‌ను ‘ట్రైన్ మేనేజర్’ గా మార్చాలని నిర్ణయించింది. అసిస్టెంట్ గార్డ్‌ను అసిస్టెంట్ పాసింజర్ ట్రైన్ మేనేజర్‌గా, గూడ్స్ గార్డ్‌ను గూడ్స్ ట్రైన్ మేనేజర్‌గా, సీనియర్ గూడ్స్ గార్డ్‌ను సీనియర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్‌గా, సీనియర్ పాసింజర్ గార్డ్‌ను సీనియర్ పాసింజర్ ట్రైన్ మేనేజర్‌గా, మెయిల్/ఎక్స్‌ప్రెస్ గార్డ్‌ను మెయిల్/ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మేనేజర్‌గా వ్యవహరించాలని పేర్కొంది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది.
అయితే పేరు మార్పు వల్ల వారి పే స్కేల్, నియామక విధానం, ప్రస్తుత విధులు, బాధ్యతలు, సీనియారిటీ, పదోన్నతలకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.