చెన్నై : పాకిస్తాన్‌కు ఇండియన్ నేవీకి సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్ చేసిన ఇండియన్ నేవీ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రదీప్ ముఖర్జీ 2014లో ఇండియన్ నేవీలో చేరాడు. విశాఖపట్నంలోని ఈస్టర్న్ నావల్ కమాండ్‌లో నావికుడిగా పనిచేశాడు. అయితే కొన్ని రోజులుగా అతను హనీట్రాప్‌లో చిక్కుకున్నాడు.
పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళతో ప్రదీప్‌కు పరిచయం ఏర్పడింది. ఆమె పాకిస్తాన్ రహస్య ఏజెంట్. ఆమెకు నౌకల కదలికలు, వాటి పనితీరు, ఇతర కీలక వివరాలను ఒక్కొక్కటిగా ప్రదీప్ చేరవేస్తూ వచ్చాడు. అతనిపై ఏపీకి చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఆదివారం కోయంబత్తూర్‌లో అతన్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.