Rafale-M | ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక నుంచి రాఫెల్-ఎమ్ విమానం టేకాఫ్.. పరీక్షించిన ఇండియన్ నేవీ
Rafale-M : రాఫెల్-ఎం (మెరైన్) ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఇండియన్ నేవీ పరీక్షించింది. గోవాలో ఉన్న యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ఈ విమానాన్ని నేవీ పరీక్షించింది. ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక.. యుద్ధ విమానాల్ని మోసుకెళ్లగలదు.
Rafale-M : రాఫెల్-ఎం (మెరైన్) ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఇండియన్ నేవీ పరీక్షించింది. గోవాలో ఉన్న యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ఈ విమానాన్ని నేవీ పరీక్షించింది. ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక.. యుద్ధ విమానాల్ని మోసుకెళ్లగలదు. ఈ నౌక నుంచి అనేక యుద్ధ విమానాల్ని ప్రయోగిస్తారు. దీనిలో భాగంగా రాఫెల్-ఎం విమానాన్ని నేవీ పరీక్షించింది.
ఈ నౌక పైనుంచి విమానం ఎలా టేకాఫ్ అవుతుంది.. ఎలా ల్యాండ్ అవుతుంది వంటి అంశాల్ని అధికారులు పరిశీలించారు. రాఫెల్ విమానాల్ని ఫ్రాన్స్ తయారు చేస్తుంది. ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్-ఎం యుద్ధ విమానాల్ని కొనేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో 22 విమానాలు సింగిల్ సీటర్ కాగా.. 4 ట్విన్ సీటర్ విమానాలు. 2028 చివర్లో లేదా 2029 ప్రారంభంలో ఈ విమానాలు ఇండియాకు అందించనుంది ఫ్రాన్స్. డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ ఈ విమానాల్ని తయారు చేస్తోంది. ఈ యుద్ధ విమానాల్ని ఇప్పుడు ఇండియన్ నేవీ పరీక్షిస్తోంది.
రాఫెల్-ఎం యుద్ధ విమానాలు అత్యంత ప్రభావవంతమైనవి. ఇవి మ్యాక్ 1.8 స్పీడ్‌తో ప్రయాణించగలవు. 15.3 మీటర్ల పొడవు కలిగి ఉంటాయి. ఎం88 టర్బో ఫయాన్ ఇంజిన్లు కలిగి ఉంటాయి. యుద్ధ నౌకల నుంచి కూడా వీటిని ప్రయోగించవచ్చు. ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్ ప్రయోగించగల శక్తి ఈ విమానాల సొంతం. అలాగే, గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోగలదు. ఈ విమానాలు ఇండియన్ నేవీలో చేరితే.. మన నావికా శక్తి, వాయు శక్తి మరింత బలోపేతం అవుతుంది. ఈ విమానాల కోసం గత ఏడాది ఏప్రిల్ 28న ఫ్రాన్స్‌తో రూ.63,000 కోట్లతో ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తంగా 2030లోపు ఈ విమానాల్ని ఇండియాకు అందించాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rafale-M | ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక నుంచి రాఫెల్-ఎమ్ విమానం టేకాఫ్.. పరీక్షించిన ఇండియన్ నేవీ
Murder | రూ.20 వాటర్ బాటిల్ కోసం ప్రాణాలు తీశారు.. అదుపులో నిందితులు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
Raihan Vadra: ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడి 75 ఫోటోలు తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

