PM Modi: ఇండియన్ ముజాహిద్దీన్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలోనూ ఇండియా పేరుంది: ప్రధాని మోదీ
PM Modi: విపక్ష కూటమి ఇండియాను తీవ్రంగా విమర్శించారు ప్రధాని మోదీ. ఇవాళ పార్టీ భేటీలో ఆయన కొత్త ఫ్రంట్‌ను దిశలేని కూటమిగా వర్ణించారు. ఇండియన్ ముజాహిద్దీన్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థల్లోనూ ఇండియా పేరు ఉన్నట్లు విమర్శించారు.
న్యూఢిల్లీ: ఇటీవల విపక్ష పార్టీలు తమ కూటమి పేరును ఇండియాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇండియా అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలియన్స్. మొత్తం 26 విపక్ష పార్టీల కలయికే ఇండియా అని ఇటీవల జరిగిన బెంగుళూరు భేటీలో కాంగ్రెస్ నేత ఖర్గే పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే కొత్తగా ఏర్పడిన ఇండియా కూటమిని ప్రధాని మోదీ(PM Modi) తీవ్రంగా విమర్శించారు.
విపక్ష పార్టీలు దిశానిర్దేశం లేకుండా ఉన్నాయన్నారు. ఇండియన్ ముజాహిద్దిన్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థల్లోనూ ఇండియా పేరు ఉందని మోదీ ఆరోపించారు. ఇంతగా దిశలేని విపక్షాన్ని ఎప్పుడూ చూడలేదని ప్రధాని మోదీ ఇవాళ జరిగిన బీజేపీ భేటీలో పేర్కొన్నారని సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి పార్టీలను కూడా విదేశీయులు ప్రారంభించినట్లు ప్రధాని మోదీ విమర్శించారు. దేశం పేరును వాడుకుని ప్రజల్ని తప్పుదోవ పట్టించలేరని ప్రధాని ఆరోపించారన్నారు. ఓడిపోయి, అలసిపోయి, ఆశలేని పార్టీలుగా విపక్షాలు మిగిలిపోయినట్లు ప్రధాని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

