Mango Exports | అమెరికాకు మామిడి ఎగుమతుల్లో అరుదైన ఫీట్
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో అమెరికాకు భారత మామిడి ఎగుమతులు(Mango Exports) ఏకంగా 19 శాతం వృద్ధి సాధించడంలో వాణిజ్యం, పరిశ్రమ మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహోరోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి అథారిటీ (అపెడా) విశేష కృషి సాధించింది.
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో అమెరికాకు భారత మామిడి ఎగుమతులు(Mango Exports) ఏకంగా 19 శాతం వృద్ధి సాధించడంలో వాణిజ్యం, పరిశ్రమ మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యవసాయ, ప్రాసెస్డ్ ఆహోరోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి అథారిటీ (అపెడా) విశేష కృషి సాధించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో అపెడా చొరవతో మామిడి ఎగుమతుల్లో గణనీయ వృద్ధి నమోదైందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకూ 48 మిలియన్ డాలర్ల విలువైన మామడిని భారత్ ఎగమతి చేసిందని, ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 19 శాతం అధికమని తెలిపింది. ఇతర దేశాలకు మామిడి ఎగుమతులు విస్తరించడంతో ఈ అరుదైన ఫీట్ సాధ్యమైందని పేర్కొంది. అమెరికన్ వ్యవసాయ, జంతు, మొక్కల ఆరోగ్య తనిఖీ సేవల (ఏపీహెచ్ఐఎస్)తో భారత్ సమన్వయంతోనే ఈ మైలురాయి చేరుకోగలిగామని తెలిపింది.
వాషి, నాసిక్, బెంగళూర్, అహ్మదాబాద్ ఫెసిలిటీల నుంచి మామిడికి ఏపీహెచ్ఐఎస్ ఇన్స్పెక్టర్లు ప్రీ క్లియరెన్స్ ఇవ్వడంతో అమెరికాకు మామిడి ఎగుమతులకు వెసులుబాటు లభించిందని వెల్లడించింది. అమెరికాతో పాటు జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు భారత్ నుంచి పెద్దసంఖ్యలో మామిడి పండ్లు ఎగుమతి అవుతుండగా తాజాగా దక్షిణాఫ్రికాకూ మామిడి ఎగుమతులు చేపట్టేందుకు భారత్ కసరత్తు సాగిస్తోంది.
Read More :
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

