దగ్గు మందు తాగి..66 మంది చిన్నారుల మృతి
పశ్చిమ ఆఫ్రికా దేశమైన గాంబియాలో ఘోర విషాదం జరిగింది. దగ్గు సిరప్ కారణంగా దేశంలో ఇప్పటి వరకూ 66 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు.
- గాంబియాలో విషాదం
- భారత్లోనేమందుల తయారీ
- డబ్ల్యూహెచ్‌వో విచారణ
జెనీవా, అక్టోబర్ 5: పశ్చిమ ఆఫ్రికా దేశమైన గాంబియాలో ఘోర విషాదం జరిగింది. దగ్గు సిరప్ కారణంగా దేశంలో ఇప్పటి వరకూ 66 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. భారత్‌కు చెందిన ఫార్మా సంస్థ మైడెన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారుచేసిన నాలుగు దగ్గు, జలుబు సిరప్‌లే పిల్లల్లో తీవ్రమైన కిడ్నీ వ్యాధులు, 66 మంది చిన్నారుల మృతికి కారణమయ్యే అవకాశం ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రొమెథజైన్ ఓరల్ సొల్యూషన్, కొఫెక్స్‌మాలిన్ బేబీ కఫ్ సిరప్, మేకాఫ్ బేబీ కఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ అనే నాలుగు ఔషధాలపై డబ్ల్యూహెచ్‌వో మెడికల్ ప్రొడక్ట్ అలర్ట్ జారీచేసింది. వీటిలో పరిమితికి మించి డైథిలిన్ ైగ్లెకోల్, ఇథిలిన్ ైగ్లెకోల్ ఉన్నట్టు గుర్తించారు. ఇవి పరిమితి దాటితే విషపూరితంగా మారుతాయని మెడికల్ ప్రొడక్ట్ అలర్ట్‌లో పేర్కొన్నది. గాంబియా దుర్ఘటనపై సంబంధిత భారత రెగ్యులేటరీ అధికారులతో కలిసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపింది. ఈ ఉత్పత్తులు సురక్షితం కాదని, వాటి ఉపయోగం మరణాలకు దారితీసే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. ఈ ప్రొడక్టులను గుర్తించి, అమ్మకాల నుంచి తప్పించాలని సూచించింది. కాగా, చిన్నారుల మరణాలపై స్పందించేందుకు మైడెన్ ఫార్మా సంస్థ నిరాకరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Deaths
- Gambia
- Indian firm'
- syrups
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

