Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Indian Army : భారత ఆర్మీకి మరింత బలం చేకూరనుంది. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (ఎస్‌డీఏఎల్) అనే సంస్థ 450 డ్రోన్లను తయారు చేసి, ఇండియన్ ఆర్మీకి అందించింది.
Indian Army : భారత ఆర్మీకి మరింత బలం చేకూరనుంది. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (ఎస్‌డీఏఎల్) అనే సంస్థ 450 డ్రోన్లను తయారు చేసి, ఇండియన్ ఆర్మీకి అందించింది. ఇవి నాగాస్త్ర-1ఆర్ పేరుగల కమికాజి డ్రోన్లు. అంటే, ఇవి సూసైడ్ డ్రోన్లు. ఇవి దగ్గర్లోని లక్ష్యాలపై దాడి చేసేందుకు ఉపయోగపడతాయి. వీటిని తయారు చేసిన ఎస్‌డీఏఎల్.. సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా సబ్సిడరీ సంస్థ.
ఇలా ఒక సంస్థ ఒకేసారి, ఇంత పెద్ద మొత్తంలో ఇండియన్ ఆర్మీకి డ్రోన్లు అందించడం ఇదే మొదటిసారి. అత్యవసర కొనుగోలులో భాగంగా ఇండియన్ ఆర్మీ వీటిని తయారు చేయించుకుంది. గత ఏడాది మార్చిలో ఇండియన్ ఆర్మీ వివిధ సంస్థల్ని ఈ డ్రోన్ల తయారీకి ఆహ్వానించింది. కానీ, ఎస్‌డీఏఎల్ సంస్త మాత్రమే నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో టెండర్ దక్కించుకుంది. నాగాస్త్ర-1ఆర్ డ్రోన్లు సూసైడ్ డ్రోన్లుగా పిలుస్తారు. ఇవి తక్కువ దూరంలోని లక్ష్యాలపై దాడి చేయగలవు. అంతేకాదు.. మధ్యలోనే అవసరమైతే తిరిగి వెనక్కి రాగలవు.
అందులోనూ డ్రోన్లను సురక్షితంగా ల్యాండ్ చేయగలవు. సాధారణంగా ఒకసారి డ్రోన్లు ప్రయోగించిన తర్వాత వాటిని మధ్యలో నిలువరించడం కష్టం. వాటిని ఆపాలంటే పేల్చేయాల్సిందే. కానీ, ఇవి తమ ప్రయాణం మధ్యలో వెనక్కుతిరిగి రాగలవు. ప్రస్తుతం అనేక దేశాలు నిరంతరం యుద్ధం చేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ఆయుధాల కొనుగోలు ఆర్థిక భారంగా మారింది. అందుకే, దేశీయంగా ఇలాంటివి తయారు చేయడం వల్ల తక్కువ ఖర్చుతోనే ఆయుధాల్ని తయారు చేసుకోగలుగుతున్నాం. ఇక, ఎస్‌డీఏఎల్ సంస్థ మరిన్ని ఆధునిక ఆయుధాలు తయారు చేసేందుకు సిద్ధమవుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

