విదేశాల నుంచి 4.5 లక్షల రెమ్‌డెసివిర్ వైల్స్ దిగుమతి

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య 4 లక్షలకు చేరుగా మరణాల సంఖ్య మూడు వేలు దాటింది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలో అత్యవసర సందర్భాల్లో వినియోగించే యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. ప్రభుత్వానికి చెందిన హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్ ఇంక్, ఈజిప్ట్ ఫార్మా కంపెనీ ఎవా ఫార్మా నుంచి 4,50,000 రెమ్‌డెసివిర్ వైల్స్‌ను తెప్పిస్తున్నట్లు పేర్కొంది.
తొలి స్టాక్ కింద 75 వేల రెమ్‌డెసివిర్ వైల్స్ శుక్రవారం చేరుతాయని కేంద్ర రసాయన, ఫెర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో రెండు మూడు రోజుల్లో అమెరికా ఫార్మా కంపెనీ నుంచి 75 వేల నుంచి లక్ష వరకు వైల్స్ సరఫరా అవుతాయని, మే 15 నాటికి మరో లక్ష వైల్స్ చేరుతాయని వివరించింది. ఈజిప్ట్‌కు చెందిన ఇవా ఫార్మా తొలుత పది వేల వైల్స్ పంపుతుందని, అనంతరం ప్రతి 15 రోజులకు 50 వేల చొప్పున జూలై వరకు రెమ్డెవిసిర్ వైల్స్‌ను సరఫరా చేస్తుందని వెల్లడించింది.
మరోవైపు దేశంలో రెమ్‌డెసివిర్ ఉత్పత్తిని కూడా వేగవంతం చేసినట్లు కేంద్రం తెలిపింది. ఏప్రిల్ 27 నాటికి లైసెన్స్ పొందిన ఏడు దేశీయ డ్రగ్ కంపెనీలు రెమ్‌డెసివిర్ ఉత్పత్తిని నెలకు 38 లక్షల నుంచి 1.03 కోట్లకు పెంచాయని చెప్పింది. గత వారంలో దేశవ్యాప్తంగా 13.73 లక్షల వైల్స్‌ను సరఫరా చేశాయని వివరించింది. అన్ని రాష్ట్రాలకు రోజు వారీ సరఫరా 67,900 నుంచి 2.09 లక్షలకు పెరిగినట్లు వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bihar | బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వంతెనపై నుంచి కాలువలో పడ్డ వాహనం, ఆరుగురు మృతి
IND vs NZ | సెంచరీ భాగస్వామ్యం పూర్తి చేసుకున్న హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్.. న్యూజిలాండ్140-5
Water Wastage | అటు వృథా..ఇటు కలుషితం..
IndiaNew vs Zealand | తొలి టెస్టులో సత్తా చాటిన భారత బౌలర్లు.. బుమ్రా ఖాతాలో మూడో వికెట్.. కివీస్ 95/5
Dia Mirza | ఆయనతో పనిచేయడం ఓ పీడకల..! దియా మీర్జా సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

