ఉత్తర కొరియా బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగాలను ఖండించిన భారత్
UN council | ఉత్తర కొరియా ఇటీవల చేపట్టిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను భారత్ ఖండించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (DPRK) ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM) ప్రయోగాలతో
న్యూయార్క్ : ఉత్తర కొరియా ఇటీవల చేపట్టిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను భారత్ ఖండించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (DPRK) ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM) ప్రయోగాలతో శాంతి, భద్రతను ప్రభావితం చేస్తుందని యూఎన్‌లో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్యోంగ్యాంగ్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టిన తర్వాత యూఎన్ భద్రతా మండలి డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాపై సమావేశం నిర్వహించడం ఇది రెండోసారి. ఇటీవల ఉత్తర కొరియా మిస్సైల్‌ను ప్రయోగించగా.. అధ్యక్షుడు కిమ్ తన భార్య, కూతురుతో కలిసి బాలిస్టిక్ మిస్సైల్ టెస్ట్‌ను పరిశీలించాడు. శత్రువులు బెదిరింపులు కొనసాగితే.. ప్రభుత్వం అణ్వాయుధాలతో ఎదుర్కొంటామని ప్రకటించాడు. ఈ క్రమంలో భద్రతా మండలి సమావేశం కాగా.. భారత్ తరఫున శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ క్షిపణులతో డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రాంతంతో పాటు వెలుపల శాంతి, భద్రతను ప్రభావితం చేస్తాయన్నారు.
అణు, క్షిపణి సాంకేతికత విస్తరణ ఆందోళన కలిగించే విషయమన్నారు. ఎందుకంటే అవి దేశంలో శాంతిభద్రతలపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం, భద్రతా మండలి ఐక్యంగా ఉండగలవని ఆశిస్తున్నామన్నారు. కొరియా ద్వీపకల్పంలో శాంతి, భద్రత దిశగా అణు నిరాయుధీకరణకు భారత్ నిరంతర మద్దతును అందిస్తుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

