Congress Party: కాంగ్రెస్ పార్టీకి రూ.1700 కోట్ల ఐటీ నోటీసు
Congress Party: కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చింది ఐటీ శాఖ. సుమారు 1700 కోట్ల ఫైన్ కట్టాలని డిమాండ్ నోటీసు జారీ చేసింది. 2017-18 నుంచి 2020-21 మధ్య కాలానికి ఆ నోటీసు చెందినట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి మరో జలక్ తగిలింది. ఆదాయపన్ను శాఖ ఆ పార్టీకి 1700 కోట్ల డిమాండ్ నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉన్నది. 2017-18 నుంచి 2020-21 మధ్య కాలానికి చెందిన డిమాండ్ నోటీసు అని తెలుస్తోంది. ఆ నోటీసులో పెనాల్టీతో పాటు వడ్డీ కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. మరో వైపు ఆదాయపన్ను శాఖ అసెస్మెంట్ను పునర్ పరిశీలించాలని కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

