Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Bribery Case: మునిషన్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్, ఆయన సోదరుదు బీ హర్షవర్దన్, ఎస్ఎంపీపీ లిమిటెడ్ సీఈవో ఆశిష్ కన్సల్ను ఓ లంచం కేసులో సీబీఐ అరెస్టు చేసింది. అధికార లాభాల కోసం అక్రమ రీతిలో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆ ముగ్గురిపై ఆరోపణలు ఉన్నాయి.
ముంబై: మునిషన్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్, ఆయన సోదరుదు బీ హర్షవర్దన్, ఎస్ఎంపీపీ లిమిటెడ్ సీఈవో ఆశిష్ కన్సల్ను ఓ లంచం కేసు(Bribery Case)లో సీబీఐ అరెస్టు చేసింది. అధికార లాభాల కోసం అక్రమ రీతిలో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆ ముగ్గురిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ముగ్గుర్నీ మంగళవారం అదపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 12వ తేదీన కేసు బుక్ చేసినట్లు సీబీఐ చెప్పింది. పుణెలోని మునిషన్స్ ఇండియ లిమిటెడ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో అనిల్ కుమార్ ప్రైవేటు కాంట్రాక్టర్లతో క్రిమినల్ అగ్రిమెంట్లు కుదుర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనిల్ కుమార్ ఇంట్లో సీబీఐ అధికారులు తనిఖీ చేసి సుమారు 1.73 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మైసూరు, బెంగుళూరు, ఢిల్లీల్లో కూడా సోదాలు చేపట్టారు. అక్కడ సుమారు 50 లక్షల నగదుతో పాటు డాక్యుమెంట్లు సీజ్ చేశారు. తనిఖీల్ల దొరికిన మొత్తం నగదు విలువ సుమారు 2.23 కోట్లుగా ఉంటుందని భావిస్తున్నారు.
ఎస్ఎంపీపీ లిమిలెడ్ కంపెనీలో ఆశిష్ కన్సల్ సీఈవోగా, డైరక్టర్‌గా చేస్తున్నారు. ఆ కంపెనీ డ్రోన్ టెక్నాలజీ, అమ్యునిషన్ ఉత్పత్తిలో ఉన్నది. కన్సల్, అనిల్ మధ్య రెగ్యులర్ సంబంధాలు ఉన్నాయని, అమ్యునిషన్ సరఫరా చేసేందుకు ఎస్ఎంపీపీ కంపెనీతో ఎంఐఎల్ 500 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఎస్ఎంపీపీ ఉద్యోగి రవి కుమార్ తివాతియా కూడా అనిల్‌తో టచ్‌లో ఉన్నారు. ఆ ఒప్పందం ద్వారా వచ్చిన లంచం అమౌంట్‌ను అనిల్ కుమార్ తన భార్య చేతనశ్రీ, సోదరుడు హర్షవర్దన్ ద్వార ట్రాన్స్ఫర్ చేశాడు. ఆశిష్ కన్సల్ నుంచి అక్టోబర్ 12వ తేదీన పెద్ద మొత్తంలో అనిల్ కుమార్‌కు ముడుపులు ముట్టినట్లు దర్యాప్తులో గుర్తించారు.
రక్షణ ఉత్పత్తులకు చెందిన ప్రభుత్వ సంస్థలో కీలకమైన స్థాయిలో ఉన్న వ్యక్తికి, ప్రైవేటు కాంట్రాక్టర్ మధ్య అక్రమ డీల్ కుదిరినట్లు తేల్చారు. బీఎన్ఎస్లోని సెక్షన్ 61(2), లంచం చట్టంలోని సెక్షన్ 7,8,9, 12 కింద అనిల్ కుమార్, ఆశిష్ కన్సల్, రావిత్ కుమార్ తివాతియా, హర్షవర్దన్, చేతనశ్రీపై కేసు బుక్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

