లండన్ : చాలా కాలం తర్వాత ఫ్రెండ్‌ను కలుసుకోవడం ఎవరికైనా ఉద్విగ్నభరితమే. ఫ్రెండ్ విదేశాల్లో ఉంటే చాలా ఏండ్ల తర్వాత వారు కలుసుకుంటే ఆ క్షణాలు మరింత అమూల్యం. ఓ ఎయిర్‌పోర్ట్‌లో ఇద్దరు ఫ్రెండ్స్ కలుసుకున్న తర్వాత వారు ప్రవర్తించిన తీరు కండ్లకు కడుతున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
This has to be one of the most legendary welcomes at Heathrow Airport pic.twitter.com/Wr9JbRv3Qg
— UB1UB2 Southall (@UB1UB2) October 21, 2022
లండన్ హెథ్రో ఎయిర్‌పోర్ట్‌లో తీసిన ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా ఆన్లైన్లో వైరల్ వుతోంది. ఈ క్లిప్‌లో ఓ వ్యక్తి తన ఫ్రెండ్‌ను చూడగానే రెయిలింగ్స్ క్రాస్ చేసి ఎయిర్పోర్ట్ ఎరైవల్ గేటు వద్దకు వెళుతుండటం కనిపించింది. ఇద్దరూ సంతోషంతో భాంగ్రా డ్యాన్స్ చేస్తూ ఒకరినొకరు హత్తుకున్నారు.
హెథ్రో ఎయిర్‌పోర్ట్‌లో అద్భుత స్వాగతం పలికిన వాటిలో ఇది ఒకటని ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌గా ఇచ్చారు. ఈ క్లిప్‌నకు 20,000కుపైగా వ్యూస్ రాగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. ఈ క్లిప్‌లో వారు వెదజల్లిన స్నేహ పరిమళాలు అద్భుతమని పలువురు యూజర్లు ప్రశంసించగా వారిద్దిరి మధ్య స్నేహానుబంధం గాఢమైందని మరికొందరు రాసుకొచ్చారు.