వైరల్ వీడియో : పనిమనిషి బర్త్‌డేను ఘనంగా సెలబ్రేట్ చేశారు!
ఇంటి పనుల్లో సాయంగా ఉండే మహిళ బర్త్‌డేను ఆ ఇంటి సభ్యులు సెలబ్రేట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రముఖ ఫొటోగ్రాఫర్ విరల్ భయానీ అధికారిక ఇన్స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేశారు.
న్యూఢిల్లీ : ఇంటి పనుల్లో సాయంగా ఉండే మహిళ బర్త్‌డేను ఆ ఇంటి సభ్యులు సెలబ్రేట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రముఖ ఫొటోగ్రాఫర్ వైరల్ భయానీ అధికారిక ఇన్స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేశారు. పనిమనిషి బర్త్‌డే సందర్భంగా కుటుంబ సభ్యులు కేక్‌తో ఆమెను ఎలా సర్ప్రైజ్ చేశారో ఈ వీడియోలో కనిపిస్తుంది. తన బర్త్‌డేను యజమానులు ఘనంగా నిర్వహించడంతో మహిళ ఉద్వేగానికి గురువుండటం స్పష్టంగా కనిపించింది. టేబుల్‌పై కేక్‌ను చూసి ఆమె ఆశ్చర్యానికి లోనవగా బర్త్‌డే కేక్ కట్ చేస్తుండగా కుటుంబ సభ్యులందరూ విషెస్ తెలిపారు.
కేక్ కటింగ్ సెషన్ అంతటా మహిళ నవ్వుతూ కనిపించారు. ఆమె బర్త్‌డేను గతంలో ఎవరూ ఇలా జరపకపోవడంతో ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో వారికి బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు..కేవలం ప్రేమ, సంతోషం వారికి అందిస్తే చాలంటూ పోస్ట్‌కు క్యాప్షన్‌గా ఇచ్చారు. భర్తతో కలిసి సిటీలో ఒంటరిగా ఉండటంతో ఆమె ముఖంపై చిరునవ్వు చూడాలని తాము కోరుకున్నామని, తన మామ ఆమె కోసం కేక్ తీసుకురాగా సెలబ్రేట్ చేశామని కుటుంబ యజమాని చెప్పుకొచ్చారు.
రోజూ మా ఇల్లును ఆమె శుభ్రం చేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతుందని అన్నారు. పనిమనిషి బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన కుటుంబాన్ని నెటిజన్లు అభినందించారు. రోజూ ఓ మంచిపని చేస్తే మనం మనుషులుగా మిగిలామని అనిపించుకోగలమని ఓ యూజర్ కామెంట్ చేయగా, మన జీవితాల్లో వారూ భాగమని మన సంతోషం, బాధలో వారు తోడుగా ఉంటారని మరో నెటిజన్ రాసుకొచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- family
- house help
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

