న్యూఢిల్లీ : ఐదేండ్ల కిందట ఓ పార్టీలో తమ డ్యాన్స్‌తో దుమ్మురేపిన సిక్కు వృద్ధ దంపతులు మరోసారి క్రేజీ స్టెప్స్‌తో హోరెత్తించారు. ఓ పెండ్లి వేడుకలో సెనోరిటా పాటకు (Viral Video) వారు స్టైలిష్ డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టారు. ఈ వీడియోలో పెద్దాయన బ్లేజర్, ప్యాంట్స్ ధరించగా మహిళ సల్వార్ సూట్లో మెరిసిపోయారు. సిఖ్లెన్స్ ఫేస్బుక్ ఖాతా ఈ వీడియోను పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
జిందగి న మిలేగి దొబర మూవీలోని సెనోరిట సాంగ్‌కు వృద్ధ జంట కిల్లర్ మూమెంట్స్‌తో ఆకట్టుకుంది. ఈ సాంగ్‌కు వారిద్దరూ మంచి సమన్వయంతో ఈజ్‌తో డ్యాన్స్ చేయడం కనిపిస్తుంది. ఈ సమాజంలో భిన్న సంస్కృతులు ఎలా కలిసి సాగుతాయనేది వారి డ్యాన్స్ వెల్లడిస్తోందని, ప్రపంచాన్ని సంగీతం, డ్యాన్స్ ఒక్కటిగా చేస్తాయి.
ఇది కేవలం డ్యాన్స్ కాదు.. భిన్నతం, ఏకత, ప్రేమల సెలబ్రేషన్ అన్నీ కలగలిసి సంగీతం విశ్వ భాషగా రూపాంతరం చెందిందని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఐ లవ్ దిస్ కపుల్ వారి గ్రేస్, రిథమ్ అద్భుతంగా ఉన్నాయని ఓ యూజర్ రాసుకొచ్చారు.
Read More
Mumbai | సహజీవనం చేస్తున్న మహిళను ట్రీ కట్టర్‌తో ముక్కలు చేసి.. కుక్కర్లో ఉడకబెట్టి..