ACP | పెండ్లి పేరుతో.. ఐఐటీ రిసెర్చ్ స్కాలర్‌పై ఏసీపీ అఘాయిత్యం
ఆమె ఐఐటీ రిసెర్చ్ స్కాలర్. సైబర్‌క్రైమ్, క్రిమినాలజీపై అధ్యయనం చేస్తున్నది. ఇందులో భాగంగా ఏసీపీతో పరిచయం ఏర్పడింది. అదనుగా తీసుకున్న పోలీస్ అధికారి పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లోబర్చుకున్నారు.
లక్నో: ఆమె ఐఐటీ రిసెర్చ్ స్కాలర్. సైబర్‌క్రైమ్, క్రిమినాలజీపై అధ్యయనం చేస్తున్నది. ఇందులో భాగంగా ఏసీపీతో పరిచయం ఏర్పడింది. అదనుగా తీసుకున్న పోలీస్ అధికారి పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లోబర్చుకున్నారు. అనంతరం మాటమార్చడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిని విధుల నుంచి తప్పించిన సీపీ.. విచారణ కోసం అడిషనల్ డీసీపీ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు.
బాధితురాలు ఐఐటీ కాన్పూర్‌లో పీహెచ్డీ చేస్తున్నది. సైబర్‌క్రైమ్, క్రిమినాలజీపై అధ్యయనం చేస్తున్నది. ఇందులో భాగంగా కాన్పూర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ACP) మహమ్మద్ మోహిసిన్ ఖాన్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత ఇద్దరిమధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆమెను ప్రేమలోకి దించిన ఏసీపీ.. తన భార్యకు విడాకులు ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. మాయమాటలు చెప్పి ఆమెపై అఘాయిత్యానికి ఒటిగట్టాడు. అనంతరం ఇచ్చిన మాటను తప్పడంతో మోసపోయానని గ్రహించిన ఆమె నగర పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో
డీసీపీ అంకితా శర్మ, ఏడీసీపీ అర్చన సింగ్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. దీంతో వారు కాన్పూర్ ఐఐటీలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా బాధితురాలు చెప్పిన దాంట్లో నిజం ఉందని తేలడంతో సీపీ అఖిల్ కుమార్‌కు నివేదిక అందించారు. దీంతో ఏసీపీపై అత్యాచారం సహా తీవ్రమైన సెక్షన్ల కింద ఏసీపీపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అతడిని విధుల నుంచి తప్పించి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- ACP
- IIT Kanpur
- Kanpur
- Marriage
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

