Nitin Gadkari | కాంగ్రెస్ తప్పులను మనం చేయెద్దు.. బీజేపీకి గడ్కరీ హెచ్చరిక
Nitin Gadkari | కాంగ్రెస్‌ను అధికారం నుంచి గద్దె దింపడానికి దారితీసిన తప్పిదాలను బీజేపీ పునరావృతం చేయవద్దని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ మేరకు సొంత పార్టీని హెచ్చరించారు. భిన్నత్వం ఉన్న పార్టీ బీజేపీ అన్న ఎల్కే అద్వానీ వ్యాఖ్యలను గుర్తు చేశారు.
పనాజీ: కాంగ్రెస్‌ను అధికారం నుంచి గద్దె దింపడానికి దారితీసిన తప్పిదాలను బీజేపీ పునరావృతం చేయవద్దని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) అన్నారు. ఈ మేరకు సొంత పార్టీని హెచ్చరించారు. భిన్నత్వం ఉన్న పార్టీ బీజేపీ అన్న ఎల్కే అద్వానీ వ్యాఖ్యలను గుర్తు చేశారు. శుక్రవారం గోవాలో జరిగిన పార్టీ అత్యున్నత స్థాయి సమావేశంలో నితిన్ గడ్కరీ మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుల వల్లనే ప్రజలు బీజేపీని ఎన్నుకున్నారని తెలిపారు. ‘కాంగ్రెస్ చేసిన పనిని మనం కొనసాగిస్తే, (అధికారం నుంచి) వారి నిష్క్రమణ, మన ప్రవేశం వల్ల ప్రయోజనం ఉండదు’ అని అన్నారు.
కాగా, తన గురువు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ వ్యాఖ్యలను ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ ప్రస్తావించారు. ‘మనది భిన్నత్వం ఉన్న పార్టీ అని అద్వానీ చెప్పేవారు. ఇతర పార్టీల కంటే మనం ఎంత భిన్నంగా ఉన్నామో అర్థం చేసుకోవాలి’ అని అన్నారు.
మరోవైపు రాబోయే రోజుల్లో దేశంలో సామాజిక, ఆర్థిక సంస్కరణలు తీసుకురావడానికి రాజకీయాలు ఒక సాధనమని, పార్టీ కార్యకర్తలు ఇది తెలుసుకోవాలని నితిన్ గడ్కరీ తెలిపారు. సొంత రాష్ట్రమైన మహారాష్ట్ర రాజకీయాలను ఆయన ప్రస్తావించారు. కుల ప్రాతిపదికన రాజకీయాలు చేయకూడదని సూచించారు. ‘ఈ ధోరణిని అనుసరించకూడదని నేను నిర్ణయించుకున్నా. కుల ఆధారిత రాజకీయాలు చేయబోనని ప్రజలకు చెప్పా. కులం గురించి మాట్లాడే వారికి బలమైన కిక్ వస్తుంది’ అని అన్నారు. అలాగే అవినీతి రహిత దేశాన్ని సృష్టించడానికి సరైన ప్రణాళిక చేయాలని పార్టీకి పిలుపునిచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలి’
AP News | అవి ఏకగ్రీవాలు కాదు.. కూటమి సర్కారు బలాత్కారాలు : వైఎస్ షర్మిల
Robbery | పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఫ్యామిలీ.. రాత్రి కారులో హైదరాబాద్‌కు తిరిగొస్తుంటే..
Malaria vaccine | మలేరియా టీకా ధరలు తగ్గింపు.. మరో 10 లక్షల మంది పిల్లలకు రక్షణ..!
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

