లోక్‌జనశక్తి నేత చిరాగ్ పాశ్వాన్ సీఎం నితీశ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నితీశ్ తలుచుకుంటే.. రష్యా రాష్ట్రపతి కూడా అవుతారని చురకలంటించారు. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కూడా అవుతారని, అయితే ఆయన బిహార్ విడవాలన్నదే తన డిమాండ్ అని అన్నారు. అసలు బిహార్ సీఎంగా ఉండి, ఆయన చేసిందేమో చెప్పాలని చిరాగ్ డిమాండ్ చేశారు.
నితీశ్ కుమార్ ఉప రాష్ట్రపతి అయినా, రాష్ట్రపతి అయినా తమకు అభ్యంతరం లేదని చిరాగ్ అన్నారు. అయితే… బిహార్ సీఎంగా ఉండి నితీశ్ ఉద్ధరించిందేదో చెప్పాల్సిన అవసరం మాత్రం ఉందని చిరాగ్ డిమాండ్ చేశారు.