ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే ఎలా? … గోధుమల ఎగుమతి నిలిపేసిన భారత్‌పై జీ 7 విమర్శ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ అనుమతి లేని గోధుమల ఎగుమతిని నిలిపివేసింది. అయితే ముందస్తు ఒప్పందాల వరకు ఎగుమతి చేసుకోవచ్చని తెలిపింది. భవిష్యత్తు ఎగుమతులపై నిషేధం విధించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో పెట్రోల్‌తోపాటు నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల, వ్యవసాయ ఉత్పత్తులపై ఎండల ప్రభావం, ఆహార భద్రత వంటి కారణాలతో గోధుమల ఎగుమతిని నిషేధించింది.
మరోవైపు ప్రపంచంలో రెండో పెద్ద గోధుమ ఉత్పత్తి దేశమైన భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని జీ 7 దేశాలు విమర్శించాయి. ఆ దేశాల వ్యవసాయ మంత్రులు జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో శనివారం సమావేశమయ్యారు. రొటీన్ పద్ధతిలో నేతృత్వం వహిస్తున్న జర్మనీ వ్యవసాయ మంత్రి సెమ్ ఓజ్డెమిర్ భారత్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ప్రతి ఒక్కరూ ఎగుమతులపై పరిమితులు విధించడం లేదా మార్కెట్లను మూసివేయడం ప్రారంభిస్తే ప్రస్తుతం ఉన్న సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వల్ల సుమారు 20 మిలియన్ టన్నుల గోధుమ ఆ దేశంలోని పలు పోర్టుల్లో నిలిచిపోయాయని జీ 7 పారిశ్రామిక దేశాల వ్యవసాయ మంత్రులు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి, మార్కెట్లపై మరింత ఒత్తిడి పెంచే విధంగా నిర్బంధ చర్యలు తీసుకోవద్దని ప్రపంచ దేశాలను కోరారు. ఎగుమతులను నిలిపివేయవద్దని, మార్కెట్లను తెరిచి ఉంచాలని పిలుపునిచ్చారు.
జీ 20 సభ్యునిగా భారత్ తన బాధ్యతను నిర్వహించాలని జీ 7 వ్యవసాయ మంత్రులు కోరారు. జూన్‌లో జర్మనీలో జరిగే జీ 7 శిఖరాగ్ర సదస్సులో ఈ అంశాన్ని ప్రస్తావించాలని సిఫార్సు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని కూడా జీ 7 శిఖరాగ్ర సదస్సుకు జర్మనీ ఇప్పటికే ఆహ్వానించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

