మగాడు మరో మగాడిని పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడుతారా: నితీశ్ కుమార్
పాట్నా: వరకట్న వ్యవస్థ నిర్మూలన కోసం బీహార్ సీఎం నితీశ్ కుమార్ తాజాగా ఓ కామెంట్ చేశారు. పెళ్లి కోసం వరకట్నం తీసుకోవడం వ్యర్థమని మరోసారి నితీశ్ స్పష్టం చేశారు. ఇటీవల పాట్నాలో గర్ల్స్ హాస్టల్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓ మహిళను పురుషుడు పెళ్లి చేసుకుంటేనే సంతానం కలుగుతుందని, ఒకవేళ ఓ మగాడు మరో మగాడిని పెళ్లి చేసుకుంటే అప్పుడు సంతానం ఏమవుతుందని ఆయన ప్రశ్నించారు. గతంలోనూ వరకన్న వ్యవస్థను ఓ సామాజిక భూతంగా వర్ణించారు. ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం అందరూ ఈ వ్యవస్థను రూపుమాపాలన్నారు. కట్న వ్యవస్థ ప్రస్తుత సమాజంలో సరైంది కాదు అని, దాన్ని అంతం చేయడం అందరి బాధ్యత అని, అప్పుడే సరైన వ్యవస్థ ఏర్పడుతుందని ఆయన అన్నారు. పెళ్లి పత్రికలపై కట్నం తీసుకోవడం లేదని రాసిన పెండ్లీలకు హాజరవుతున్నట్లు ఆయన చెప్పారు. వరకట్నం, బాల్య వివాహాలను అరికట్టే ఉద్దేశంతో 2017లో నితీశ్ కుమార్ రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపట్టారు.
#WATCH | While inaugurating a newly constructed girls hostel in Patna on May 23, Bihar CM Nitish Kumar said, "Taking dowry for marriage is a useless thing. If you'll get married then only children will be born.What will happen to childbirth if a man gets married to another man?" pic.twitter.com/mXf2ERraO0
— ANI (@ANI) May 25, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

