Rafale Jets | మరో 117 రఫేల్ యుద్ధ విమానాల కోసం ఐఏఎఫ్ ప్రతిపాదనలు..! హైదరాబాద్‌లో ఓవర్‌హాల్ ఫెసిలిటీ..!
Rafael Jets | భారత వైమానిక దళం (IAF) మరో 114 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలనే రక్షణశాఖకు ప్రతిపాదనలు అందించింది. ఈ జెట్లను ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్, టాటా వంటి భారతీయ అంతరిక్ష సంస్థలు తయారు చేస్తాయి.
Rafale Jets | భారత వైమానిక దళం (IAF) మరో 114 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలనే రక్షణశాఖకు ప్రతిపాదనలు అందించింది. ఈ జెట్లను ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్, టాటా వంటి భారతీయ అంతరిక్ష సంస్థలు తయారు చేస్తాయి. జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. ఈ ప్రదిపాదన అంచనాలు రూ.2లక్షల కోట్ల వరకు ఉంటుంది. రాబోయే రోజుల్లో రక్షణ కార్యదర్శి నేతృత్వంలోని డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ బోర్డు ఈ విషయంపై చర్చించనున్నది. విమానాల భాగాల్లో 60 శాతం భారతదేశంలోనే తయారు చేయనున్నట్లు పేర్కొంది. తెలంగాణలోని హైదరాబాద్‌లో రాఫెల్ జెట్ల ఎం-88 ఇంజిన్ల నిర్వహణ, మరమ్మతుల ఓవర్‌హాల్ ఫెసిలిటీని సైతం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఏఎన్ఐ తెలిపింది.
భారత వైమానిక దళం తయారుచేసిన 114 రాఫెల్ జెట్ల ప్రతిపాదన, స్టేట్మెంట్ ఆఫ్ కేస్ (SoC) కొద్దిరోజుల క్రితం రక్షణ మంత్రిత్వ శాఖకు అందింది. ఈ ప్రతిపాదన డిఫెన్స్ ఫైనాన్స్ సహా దాని కింద ఉన్న వివిధ విభాగాల పరిశీలనలో ఉంది. చర్చల తర్వాత ఈ ప్రతిపాదనను డీపీబీకి.. ఆ తర్వాత డిఫెన్స్ ఆక్విజిషన్ కౌన్సిల్‌కు పంపుతారని రక్షణశాఖ అధికారులను ఉటంకిస్తూ ఏఎన్ఐ నివేదిక తెలిపింది. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్తిసాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందులో రఫేల్ యుద్ధ విమానాలను వినియోగించిన విషయం విధితమే.
ఈ క్రమంలో తాజాగా వాయుసేన ఈ ప్రతిపాదనను తీసుకువచ్చింది. రఫెల్ యుద్ధ విమానాలు స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్‌ను ఉపయోగించి.. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఉపయోగించిన చైనీస్ పీఎల్-15 ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్స్‌ను విజయవంతంగా ఓడించాయని రక్షణ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎయిర్‌ఫోర్స్ వద్ద 36 రఫేల్ జెట్స్ ఉన్నాయి. మరోవైపు, ఇండియన్ నేవి 26 రాఫెల్‌లను కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చింది. అయితే, కొత్త ఆర్డర్ నేపథ్యంలో భారత డిఫెన్స్‌లోకి రఫేల్ జెట్ల సంఖ్య 176కి పెరగనున్నది. ప్రస్తుతం ఐఏఎఫ్ 4.5 జెనరేషన్ విమానాలు అయిన రాఫెల్స్, సుఖోయ్ Su-30, హెచ్ఏఎల్ తేజస్‌లను ఉపయోగిస్తోంది. నాల్గవ తరం యుద్ధ విమానాలు అయిన డస్సాల్ట్ మిరాజ్ 2000, మికోయన్ MiG-29లను సైతం వాడుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

