Ajit Pawar | ‘నా మంత్రి పదవి రేపటికి ఉంటుందో లేదో చెప్పలేదు’.. అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు
Ajit Pawar | మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) సంచలన వ్యాఖ్యలు చేవారు. తన మంత్రి పదవి రేపటికి ఉంటుందో లేదో చెప్పలేనని అన్నారు. అమిత్ షా ముంబై కార్యక్రమాలకు దూరంగా ఉన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajit Pawar) సంచలన వ్యాఖ్యలు చేవారు. తన మంత్రి పదవి రేపటికి ఉంటుందో లేదో చెప్పలేనని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముంబై పర్యటన సందర్భంగా సీఎం ఏక్నాథ్ షిండ్, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు ఆయనను కలిశారు. అయితే అమిత్ షా కార్యక్రమాలకు అజిత్ పవార్ దూరంగా ఉన్నారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
కాగా, ఎన్సీపీలో తిరుగుబాటు చేసిన అజిత్ పవార్ తన వర్గంతో కలిసి శివసేన-బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పూణేలోని బారామతిలో జరిగిన కార్యక్రమంలో అజిత్ పవార్ మాట్లాడారు. ‘ఈ రోజు, నాకు ఆర్థిక శాఖ బాధ్యత ఉంది. కానీ రేపు అది ఉంటుందో లేదో నేను చెప్పలేను’ అని అన్నారు.
మరోవైపు అమిత్ షా కార్యక్రమానికి మిస్ కావడంపై వస్తున్న ఊహాగానాలను అజిత్ పవర్ ఖండించారు. ముందుగా ప్లాన్ చేసిన కొన్ని కార్యక్రమాలు ఉండటం వల్ల ఆయనను కలువలేకపోయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని అమిత్ షా కార్యాలయానికి తెలియజేసినట్లు చెప్పారు. కాగా, విద్యా సంస్థల్లో ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లపై సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌లతో తాను చర్చలు జరుపుతానని అజిత్ పవార్ ఇటీవల అన్నారు. అయితే శివసేన-బీజేపీ ప్రభుత్వం దీనికి సుముఖంగా లేకపోవడంతో అజిత్ పవార్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

