Vikram-1: ప్రయోగానికి విక్రమ్-1 రాకెట్ సిద్ధం.. చరిత్ర సృష్టించనున్న హైదరాబాదీ స్టార్టప్
Vikram-1: హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ చరిత్ర సృష్టించనున్నది. నగరానికి చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేటు కంపెనీ తయారు చేసిన విక్రమ్-1 రాకెట్ త్వరలో నింగికి ఎగరనున్నది. జూలై 12 నుంచి ఆగస్టు 4వ తేదీ మధ్య శ్రీహరికోట నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించే అవకాశాలు ఉన్నాయి.
హైదరాబాద్: భారతీ అంతరిక్ష రంగంలో.. హైదరాబాద్ కంపెనీ కొత్త పుంతలు తొక్కనున్నది. నగరానికి చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ రూపొందించిన విక్రమ్-1(Vikram-1) రాకెట్ త్వరలో నింగికి ఎగరనున్నది. తొలిసారి దేశంలో ఓ ప్రైవేటు కంపెనీ.. ఆర్బిటాల్ క్లాస్ రాకెట్‌ను డెవలప్ చేసింది. విక్రమ్-1 రాకెట్ టెస్ట్ ఫ్లయిట్‌కు మిషన్ ఆగమన్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ సెంటర్లో ఉన్న ఫస్ట్ లాంచ్ ప్యాడ్‌లో ఆ రాకెట్ సిద్ధంగా ఉన్నది.
జూలై 12 నుంచి ఆగస్టు 4వ తేదీ మధ్య ఈ రాకెట్‌ను ప్రయోగించే అవకాశాలు ఉన్నాయి. గతంలో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థలో పనిచేసిన ఇంజినీర్లు ఈ స్కైరూట్ కంపెనీని స్థాపించారు. రాకెట్ ల్యాబ్ కంపెనీ తరహాలో స్కైరూట్ చిన్న తరహా రాకెట్లను నిర్మిస్తున్నది.
ఏడంతస్తుల ఎత్తు ఉండే విక్రమ్-1 రాకెట్‌ను మల్టీస్టేజ్ లాంచ్ వెహికిల్‌గా రూపొందించారు. దిగువ భూ-కక్ష్యలోకి సుమారు 350 కిలోగ్రాముల పేలోడ్‌ను ఈ రాకెట్ మోసుకెళ్తుంది. భారత్‌కు చెందిన బిలియన్ డాలర్ల స్పేస్ స్టార్టప్‌గా స్కైరూట్ నమోదు అయ్యింది.
🚀 Announcing Vikram-1 Test Flight-1: Mission Aagaman, India’s first private orbital rocket launch.
📍 Satish Dhawan Space Centre, Sriharikota
🛰️ 450 km, 60 degree inclination, Low Earth Orbit
📅 Launch Window: July 12 – August 4, 2026Vehicle is now fully stacked at India’s… pic.twitter.com/mqqJnO5RoI
— Skyroot Aerospace (@SkyrootA) July 2, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

