పాట్నా, జూలై 7: ప్రముఖ తెలుగు సినిమాలోని దృశ్యం నిజజీవితంలో నిజమైంది. 1998లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో విడుదలైన ‘కన్యాదానం’ చిత్రంలో జరిగినట్టే సాక్షాత్తు భర్తే తన భార్యను ప్రియుడికిచ్చి పెండ్లి చేసిన సంఘటన బీహార్లో చోటు చేసుకుంది. బీహార్లోని ఒక గ్రామానికి చెందిన ఓ మహిళ ప్రియుడితో ఏకాంతంగా ఉండగా కుటుంబ సభ్యులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న భర్త వారిని వారించి భార్యను, ఆమె ప్రియుడిని గుడికి తీసుకుని వెళ్లి వారిద్దరికీ వివాహం జరిపించాడు.