Chandrayaan-3 | చందమామపై చంద్రయాన్-3 ఎలా ల్యాండ్ అవుతుందంటే..?
Chandrayaan-3 | భారత్ పంపిన చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా జాబిల్లి చెంతకు చేరింది. ఇక ఇప్పుడు జాబిల్లిపై ఈ మూన్ మిషన్ ఎలా ల్యాండ్ అవుతుందనే దానిపైనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైనందున.. ఇప్పుడు అలాంటి చేదు అనుభవమే ఎదురవుతుందా..? లేదంటే చంద్రయాన్-1 మాదిరిగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరుతుందా..? ఇంతకూ ఏం జరుగనుంది అనే ఉత్కంఠ భారత శాస్త్రవేత్తలతో పాటు సాధారణ ప్రజలను కూడా టెన్షన్ పెడుతున్నది.
బెంగళూరు: భారత్ పంపిన చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ విజయవంతంగా జాబిల్లి చెంతకు చేరింది. ఇక ఇప్పుడు జాబిల్లిపై ఈ మూన్ మిషన్ ఎలా ల్యాండ్ అవుతుందనే దానిపైనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైనందున.. ఇప్పుడు అలాంటి చేదు అనుభవమే ఎదురవుతుందా..? లేదంటే చంద్రయాన్-1 మాదిరిగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరుతుందా..? ఇంతకూ ఏం జరుగనుంది అనే ఉత్కంఠ భారత శాస్త్రవేత్తలతో పాటు సాధారణ ప్రజలను కూడా టెన్షన్ పెడుతున్నది.
ఈ నేపథ్యంలో మూన్ మిషన్ ల్యాండింగ్ ఎలా జరుగుతుందనే విషయాన్ని బెంగళూరులోని ఇస్రో వర్గాలు వెల్లడించాయి. రామాయణాన్ని ‘కట్టే కొట్టే తెచ్చే’ అని మూడు ముక్కల్లో చెప్పినట్టుగా ఈ చంద్రయాన్-3 ల్యాండింగ్ విషయాన్ని కూడా తెలియజేశారు. వారు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం చంద్రుడి సమీప కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్-3 ఇస్రో సైంటిస్టుల ఆదేశాలకు అనుగుణంగా చందమామ ఉపరితలం వైపు ప్రయాణం మొదలు పెట్టి 20 నిమిషాల్లో ల్యాండ్ అవుతుంది.
ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 5.45 గంటలకు బెంగళూరులోని ‘ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ (ISTRAC) చంద్రయాన్-3 మిషన్‌కు తన ఆదేశాలను చేరవేస్తుంది. ఆ వెంటనే మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్ చంద్రయాన్ ఉపరితలం వైపు ప్రయాణం మొదలు పెడుతుంది. అయితే వేగం తగ్గించుకుని ల్యాండయ్యే సమయంలో మాత్రం.. ల్యాండర్ తనలోని సాంకేతిక వ్యవస్థ ఆధారంగా తనను తాను నియంత్రించుకుంటూ దిగుతుంది. తనలోని సెన్సార్స్ అందించే డాటా ఆధారంగా జాబిల్లిపై కాలు మోపడానికి అవసరమైన సర్దుబాట్లు, మార్పులు చేసుకుంటుంది. ఈ 20 నిమిషాల ప్రక్రియ సజావుగా సాగితే చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైనట్టే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
IPL 2028 | రూ.40 కోట్లు ఇస్తేనే మీ జట్టులో ఉంటాం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు టాప్ ప్లేయర్ల షాక్!
అర్హులైన చెంచులందరికీ ఉపాధి కల్పిస్తాం: సీతక్క
7 నుంచి హకీంపేటలో మెగా రైతుమేళా: తుమ్మల
Gold Adulteration | బంగారం కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. యాసిడ్ పరీక్షలోనూ దొరకని కొత్త కల్తీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

