House Help Stuck In Lift | లిఫ్ట్‌లో చిక్కుకున్న పనిమనిషి.. కాపాడుతుండగా కిందపడి మృతి
House Help Stuck In Lift | అపార్ట్మెంట్లోని ఇళ్లలో పని చేసే మహిళ లిఫ్ట్‌లో చిక్కుకుంది. కాపాడుతుండగా అదుపు తప్పిన ఆమె మూడో అంతస్తు నుంచి కింద పడి మరణించింది. దీంతో బంధువులు ఆమె మృతదేహంతో నిరసన చేశారు.
జైపూర్: అపార్ట్మెంట్లోని ఇళ్లలో పని చేసే మహిళ లిఫ్ట్‌లో చిక్కుకుంది. (House Help Stuck In Lift) కాపాడుతుండగా అదుపు తప్పిన ఆమె మూడో అంతస్తు నుంచి కింద పడి మరణించింది. దీంతో బంధువులు ఆమె మృతదేహంతో నిరసన చేశారు. రాజస్థాన్‌లోని కోటాలో ఈ సంఘటన జరిగింది. శ్యామ్నగర్లో నివాసం ఉంటున్న 43 ఏళ్ల రుక్మిణిబాయి ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్‌లోని ఇళ్లలో ఇంటి పనులు చేస్తున్నది. గురువారం మధ్యాహ్నం తన ఇంటికి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కింది. అయితే విద్యుత్ సరఫరాలో లోపం వల్ల లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో సుమారు 45 నిమిషాలు అందులో ఆమె చిక్కుకుంది.
కాగా, మూడో అంతస్తులో నివసించే కొందరు మహిళలు లిఫ్ట్‌లో చిక్కుకున్న రుక్మిణిబాయి అరుపులు విన్నారు. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే అదుపుతప్పిన పనిమనిషి మూడో అంతస్తు నుంచి కింద పడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు అపార్ట్మెంట్ యజమానుల నిర్లక్ష్యం కారణంగా రుక్మిణిబాయి చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. శుక్రవారం ఆర్కే పురం పోలీస్‌స్టేషన్ వద్ద మృతదేహంతో నిరసనకు దిగారు. పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. పోలీసులు హామీ ఇ్వవడంతో శాంతించారు. పనిమనిషి కుటుంబం ఫిర్యాదుతో అపార్ట్మెంట్ బిల్డింగ్‌లోని ముగ్గురు ఇంటి ఓనర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Dies
- falling
- house help
- Kota
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

