నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వున్న పిల్లల్ని మీ బండిపై తీసుకెళ్తున్నారా? అయితే ఇగో కొత్త రూల్స్ ఫాలో కావాల్సిందే. నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లల్ని బండిపై తీసుకెళితే కచ్చితంగా వారికి కచ్చితంగా హెల్మెట్ ధరింపజేయాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ తాజాగా నిబంధనలను జారీ చేసింది. అలాగే రక్షణ బెల్టు కూడా కచ్చితంగా ఉండాలని సూచించింది. అలాగే నాలుగేళ్ల పిల్లవాడు బైక్ వెనకాల కూర్చుంటే 40 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాలని కూడా కేంద్రం నిబంధన విధిచింది. అంతకంటే ఎక్కువ వేగంగా వెళ్లకూడదని సూచించింది. ఈ నెల నుంచే ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని పేర్కొంది.
సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ 1989 ని సవరించడం ద్వారా ఈ కొత్త నిబంధనలు తెరపైకి వచ్చాయని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే బైక్ వెనకాల ప్రమాదకర వస్తువులను తీసుకెళితే.. కచ్చితంగా నిఘా పరికరాలుండాని పేర్కొంది. చిన్న పిల్లల విషయంలో ఇప్పటి వరకూ ఎలాంటి భద్రతా ప్రమాణాలను రూపొందించడం జరగలేదని, దీని ద్వారా ప్రమాదాల్లో పిల్లలు కూడా మరణిస్తున్నారని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మరణించే వారు కూడా అధికంగానే వున్నారని, దీని దృష్ట్యా చిన్న పిల్లల విషయంలో ఓ ప్రత్యేక రూల్స్‌ను తెచ్చామని రవాణా శాఖ అధికారులు అంటున్నారు.