Helicopter Crash | ఆ హెలికాప్టర్ కూలిపోయింది.. పైలట్ సహా ఆరుగురు దుర్మరణం..!
Helicopter Crash | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని చమోలీ జిల్లా (Chamoli district) లో గల్లంతైన హెలికాప్టర్ (Helicopter) కూలిపోయింది. హెలికాప్టర్ బద్రీనాథ్ (Badrinath) నుంచి డెహ్రాడూన్ (Dehradun) కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన సమయంలో ఆ హెలికాప్టర్లో పైలట్ సహా ఆరుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలిసింది.
Helicopter Crash : ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని చమోలీ జిల్లా (Chamoli district) లో గల్లంతైన హెలికాప్టర్ (Helicopter) కూలిపోయింది. హెలికాప్టర్ బద్రీనాథ్ (Badrinath) నుంచి డెహ్రాడూన్ (Dehradun) కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన సమయంలో ఆ హెలికాప్టర్లో పైలట్ సహా ఆరుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలిసింది. జోషిమఠ్ (Joshimatt) కు దగ్గరలో ఉన్న చైయెన్ (Chaien) గ్రామం సమీపంలో హెలికాప్టర్ కూలినట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ఉన్న ఆరుగురు మరణించి ఉంటారని భావిస్తున్నారు.
ప్రమాదం సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన అధికారులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. మరో రెండు హెలికాప్టర్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ప్రతికూల వాతావరణం ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బందికరంగా ఉందని అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
బద్రీనాథ్ నుంచి మధ్యాహ్నం 2.15 నిమిషాలకు హెలికాప్టర్ టేకాఫ్ తీసుకున్నది. హతీ పర్వత్ ఏరియా వద్ద ఆ హెలికాప్టర్‌తో కాంటాక్టు తెగినట్లు చెబుతున్నారు. స్నో కురవడంవల్ల హతీ పర్వత్ ఏరియా వద్ద కాంటాక్టు కోల్పోయినట్లు అధికారులు తేల్చారు. రాష్ట్ర, ఆర్మీ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Helicopter Crash | ఆ హెలికాప్టర్ కూలిపోయింది.. పైలట్ సహా ఆరుగురు దుర్మరణం..!
Anant Singh | బహిష్కృత జేడీ(యూ) ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు సుప్రీంకోర్టులో నిరాశ.. డిసెంబర్ 1 లోగా లొంగిపోవాలని ఆదేశం
Cult Review | ‘కల్ట్’ సినిమా రివ్యూ.. విశ్వక్సేన్ కొత్త సినిమా ఎలా ఉందంటే!
Inter Student | అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Rise | రూ.100 చేరువలో కిలో బియ్యం..! సామాన్య ప్రజల రక్తం తాగుతున్న రైస్ మాఫియా
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

