Chennai Rains | తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు.. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్..!
Chennai Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణంగా చెన్నై, తిరువళ్లూరు, రాణీపేట్, కాంచీపురం జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. చెన్నై సహా పలు జిల్లాలకు రానున్న రెండు మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకావం ఉందని చెన్నై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

నీలగిరి, కోయంబత్తూర్, కాంచీపురం, తిరుప్పూర్, విల్లుపురం, వెల్లూరు, సాలెం, నాగపట్నం, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. ఏకధాటిగా కురుస్తున్న వానలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. చెన్నైలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలుచోట్ల పంట పొలాలు నీట మునిగాయి. రోడ్లపై భారీగా వరదనీరు చేరడంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నై సహా రాష్ట్రంలోని దాదాపు 26 జిల్లాలకు పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న చెన్నై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సముద్రంలో అలల ఉధృతి నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!