INDIA bloc | ఇండియా బ్లాక్ ర్యాలీతో మాకు సంబంధం లేదు.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ వెల్లడి
INDIA bloc : నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ సహా ఇండియా బ్లాక్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ర్యాలీతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎంఐఎం పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
INDIA bloc : నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ సహా ఇండియా బ్లాక్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ర్యాలీతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎంఐఎం పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై అసదుద్దీన్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై స్పందించారు. ఇండియా బ్లాక్ ర్యాలీతో మాకు ఎలాంటి సంబందం లేదు. నేను సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నా. అందుకోసమే కోర్టులో కేసు వేశా. సర్‌కు సంబంధించిన అన్ని అంశాలపై ప్రశ్నించాను.
సీఈసీని నియమించడం దగ్గరి నుంచి సీఈసీకి చట్టపరమైన రక్షణ కల్పించడానికి కూడా నేను వ్యతిరేకం. అయితే, దీనికోసమే ఇండియా బ్లాక్ కూటమి చేపడుతున్న ర్యాలీతో మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం జేఎన్‌యూలో జరుగుతున్న కాశ్మీర్ ఫ్రీ గ్రాఫిటీ అంశంపై కూడా అసదుద్దీన్ మాట్లాడారు. కాశ్మీర్‌ను వేరు చేయాలంటూ యూనివర్సిటీలో రూపొందిన గ్రాఫిటీకి ఎవరు బాధ్యులు..? యూనివర్సిటీ వీసీ, రిజిష్ట్రార్. ఆ ఇద్దరూ ఆర్ఎస్ఎస్ ముస్లిం రాష్ట్ర మోర్చా సభ్యులే. వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి. జేఎన్‌యూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలో న్యాయం ఉంది.
ఈ విషయాన్ని విస్మరించడానికి వీల్లేదు. షర్జీల్ ఇమామ్ సిద్ధాంతాలపై మీకు వ్యతిరేకత ఉండొచ్చు. అది మీకు నచ్చకపోవచ్చు. అంతమాత్రాన అతడికి అదే అంశంపై న్యాయం జరగకుండా అడ్డుకోవడం సరికాదు. న్యాయం చేయడం అనేది కోర్టుల పని. ఆ కేసు విచారణ కొనసాగనివ్వండి. కనీసం అది కూడా జరగనివ్వకుండా అడ్డుకుంటున్నారు అంటూ అసదుద్దీన వ్యాఖ్యానించారు. ఇక.. నవంబర్ 1న ఢిల్లీ, రాంలీలా మైదానంలో ఇండియా బ్లాక్ ఆధ్వర్యంలో ర్యాలీ జరగనుంది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర కూటమి పార్టీల నేతలు ఇందులో పాల్గొననున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
INDIA bloc | ఇండియా బ్లాక్ ర్యాలీతో మాకు సంబంధం లేదు.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ వెల్లడి
Anant Singh | ‘నితీశ్ కుమార్ వెళ్లిపోయారు, జేడీయూ కూడా అంతే’.. బహిష్కరణ తర్వాత అనంత్ సింగ్
Bigg Boss 10 | బిగ్‌బాస్ 10లో డబుల్ ఎలిమినేషన్ .. దక్షి, శాలిని ఔట్, రెమ్యునరేషన్ వివరాలు వైరల్!
DK Shivakumar | కన్నడ యువతకు ఉద్యోగాలివ్వకపోతే చర్యలు కఠినంగుంటాయ్ : డీకే శివకుమార్
Gummadi Narsaiah | కరువుపై ప్రకటనలేనా.. సహాయక చర్యలేవీ? : గుమ్మడి నర్సయ్య
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

