జూన్ 2న బీజేపీలోకి హార్దిక్ పటేల్
అహ్మదాబాద్ : గుజరాత్‌కు చెందిన పటీదార్ ఉద్యమ నేత, కాంగ్రెస్ మాజీ నేత హార్దిక్ పటేల్ జూన్ 2న బీజేపీలో చేరనున్నట్లు ధ్రువీకరించారు. హర్దిక్ ఈ నెల 18న కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు హార్దిక్ పార్టీని విడడంతో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. 2019లో కాంగ్రెస్‌లో చేరిన హార్దిక్ పటేల్.. 2020, జూలై 11న గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకమయ్యారు. ఆ తర్వాత పార్టీ అధిష్టానం, నాయకత్వం తీరుపై విసుగు చెంది రాజీనామా చేశారు.
ఈ సమయంలో పార్టీ హైకమాండ్‌పై విరుచుకుడ్డారు. ‘క్లిష్ట పరిస్థితుల్లో దేశంలో ఉండాల్సిన వేళ మన నాయకుడు విదేశాల్లో ఉన్నారు’ అంటూ ఆయన రాహుల్ గాంధీని ఉద్దేశించి సోనియాకు రాసిన లేఖలో ప్రస్తావించారు. ‘అగ్ర నాయకులను నేను కలిసినప్పుడు.. వారు గుజరాత్‌కు సంబంధించిన సమస్యలను వినకుండా ఫోన్లతో గడిపారు’ అంటూ రాజీనామా లేఖలో కాంగ్రెస్ నాయకత్వం తీరును తప్పుబట్టారు. కాంగ్రెస్ నాయకత్వం గుజరాత్ పట్ల తీవ్ర విముఖతతో ఉందని, రాష్ట్రం పట్ల వారికి ఆసక్తి లేదు’ అంటూ ఆరోపించారు. ప్రజల ముందుకు వెళ్లడానికి సరైన కార్యచరణ లేకపోవడంతో.. ప్రతి రాష్ట్రంలోనూ ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారని విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

