Patna | బైక్‌పై నిలబడి రెండు చేతుల్లో గన్స్‌తో అమ్మాయి స్టంట్స్.. వీడియో వైరల్
సోషల్ మీడియా మోజులో పడి ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ యువత ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. బీహార్‌లోని పట్నాలో (Patna) ఓ యువతి వేగంగా వెళ్తున్న బైక్‌పై (Moving bike) నిల్చుని, తన రెండు చేతుల్లో రెండు తుపాకులు (Guns) పట్టుకుని కెమెరాకు ఫోజులిచ్చింది.
పట్నా: సోషల్ మీడియా మోజులో పడి ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ యువత ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. బీహార్‌లోని పట్నాలో (Patna) ఓ యువతి వేగంగా వెళ్తున్న బైక్‌పై (Moving bike) నిల్చుని, తన రెండు చేతుల్లో రెండు తుపాకులు (Guns) పట్టుకుని కెమెరాకు ఫోజులిచ్చింది. పట్నాలో ఓ యువ జంట మెరైన్ డ్రైవ్ (Marine Drive) మాదిరిగా తామూ స్టంట్ చేయాలనుకున్నారో ఏమో.. అనుకున్నదే తడవుగా జేపీ గంగా పాథ్‌వే (JP Ganga Pathaway) యువకుడు వేగంగా బైక్ నడుపుతుండగా, వెనక కూర్చున్న యువతి లేచి నలబడి తన రెండు చేతుల్లో తుపాకులను గాల్లోకి చూపించింది. దీనినంతటినీ వారి వెంటే వస్తున్న మరో బైకర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది.
సంబంధిత వీడియోపై దర్యాప్తు చేస్తున్నామని పట్నా ఎస్పీ వైభవ్ శర్మ (SP Vaibhav Sharma) చెప్పారు. ప్రమాదకరమైన స్టంట్లు చేసిన యువకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో ఆధారంగా బైక్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను గుర్తించామని, త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. కాగా, ఇదే తరహా ఘటన అదే ప్రాంతంలో కొన్ని నెలల కిందట కూడా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ యువతి చూపించిన తుపాకులు బొమ్మవని విచారణలో తేలింది.
म्हारि छोरियां चोरों से कम है के 🤨
देखिए #Patna के #MarineDrive पर कैसे दोनों हाथों में पिस्टल लहरा रहीं हैं… हालांकि Central SP Vaibhav Sharma ने इन्हें गेयर में ले लिया है 😁 pic.twitter.com/GabwHv6wZn— Akshay Anand (@AkshayAnandTN) August 19, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Girl
- Guns
- JP Ganga Pathaway
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

