న్యూఢిల్లీ : బతుకు తెరువు కోసం పట్టణానికి వలస వచ్చిన ఓ వ్యక్తి అద్దె చెల్లించలేక ఇంటి యజమాని తన భార్య, కూతురిపై లైంగిక దాడి చేయడానికి అంగీకరించాడు. ఈ మేరకు అతడితో ఒప్పందం చేసుకొన్నాడు. పోలీసుల కథనం ప్రకారం&గుజరాత్‌లోని సురేంద్ర నగర్‌కు చెందిన ఒక కుటుంబం జీవనోపాధి కోసం కొన్ని నెలల క్రితం మోర్బికి వలస వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల నాలుగు నెలలుగా అద్దెకు వచ్చిన వ్యక్తి అద్దె చెల్లించలేకపోయాడు.
దీంతో తన భార్య, మైనర్ అయిన తన కూతురిపై ఇంటి యజమాని లైంగిక దాడి చేయడానికి అనుమతి ఇచ్చాడు. యజమాని వారిద్దరిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇటీవల బాధిత మహిళ తల్లికి ఈ విషయం తెలియడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇంటి యజమానిని, అద్దెకు ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.