న్యూఢిల్లీ : క్రేజీ డ్యాన్స్ మూమెంట్స్, సంగీత్, బారాత్ హడావిడి లేకుండా దేశీ పెండ్లిండ్లను ఊహించలేం. తాజాగా ఓ వెడ్డింగ్‌లో బెల్జియం జాతీయుడు దేశీ డ్యాన్స్ మూవ్స్‌తో దుమ్మురేపిన వీడియో (Viral video) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో బెల్జియం వాసి భారతీయ డ్యాన్స్ మూమెంట్స్ తనకు నేర్పాలని అక్కడున్న వారిని కోరగా వారు కొన్ని మూమెంట్స్ అతడితో చేయించడం కనిపిస్తుంది. మీ ఫేవరెట్ డ్యాన్స్ మూమెంట్స్ నాకు నేర్పిస్తారా..? ఇండియన్ వెడ్డింగ్ అనే టెక్ట్స్‌తో ఈ క్లిప్ మొదలువుతుంది. ఓ పెండ్లి వేడుకలో పలువురు అతిధుల మధ్య బెల్జియం వ్యక్తి ఈ క్లిప్‌లో కనిపిస్తాడు.
ఈ వైరల్ వీడియోకు నెటిజన్లు ఫిదా అయ్యారు. బ్రదర్..భారత్‌కు స్వాగతం..మీ జీవితంలో మీరు బెస్ట్ టైమ్‌ను ఇక్కడ గడుపుతారని ఓ యూజర్ కామెంట్ చేయగా డ్యాన్స్ మూమెంట్స్ నేర్చుకోండి..ముందు పెండ్లి వేడుకను ఎంజాయ్ చేయండి బ్రదర్ అని మరో యూజర్ కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.