పెళ్లి అనేది ఎవరి జీవితంలో అయినా ఓ మధుర జ్ఞాపకాన్ని మిగుల్చుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనే ఘట్టం ఒకేసారి వస్తుంది. అందుకే.. పెళ్లిని ఎంతో స్పెషల్‌గా చేసుకోవాలని అందరూ ఆరాటపడుతుంటారు. దాని వల్ల పెళ్లి మండపంలో ఎన్నో ఫన్నీ ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా అటువంటిదే ఒకటి ఓ పెళ్లి మండపంలో చోటు చేసుకుంది.
పెళ్లి కొడుకు తన ఫ్రెండ్స్‌తో కలిసి పెళ్లి వేదిక మీద పెళ్లి కూతురు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో పెళ్లి కూతురును తీసుకొస్తూ ఉంటారు. సడెన్‌గా పెళ్లి కూతురును చూడగానే వరుడు ఫిదా అయిపోతాడు. తన ఫ్రెండ్స్ మీద పడిపోతాడు. ఆ తర్వాత పెళ్లి కూతరు చేయి అందుకొని తనను స్టేజ్ మీదికి తీసుకొస్తాడు.
అయితే.. ఈ వీడియోను ఎక్కడ తీశారు.. ఎప్పుడు తీశారు అనే విషయం తెలియనప్పటికీ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో వైరల్ అవుతోంది. నీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది.. అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ కూడా పెట్టారు. నెటిజన్లు కూడా ఈ వీడియోను చూసి వావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.