కొవిడ్ టీకా మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించదు..! ‘సుప్రీం’లో కేంద్రం అఫిడవిట్
Covid-19 Vaccine Death | కొవిడ్-19 వ్యాక్సినేషన్‌ను ప్రజాప్రయోజనాల దృష్టా ప్రభుత్వం ప్రోత్సహించిందని, టీకాలు వేయడానికి చట్టపరమైన బలవంతం ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కొవిడ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాల కారణంగా గతేడాది ఇద్దరు బాలికలు మరణించగా.. తల్లిదండ్రులు దాఖలు చేసిన
Covid Vaccine Death | కొవిడ్-19 వ్యాక్సినేషన్‌ను ప్రజాప్రయోజనాల దృష్టా ప్రభుత్వం ప్రోత్సహించిందని, టీకాలు వేయడానికి చట్టపరమైన బలవంతం ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కొవిడ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాల కారణంగా గతేడాది ఇద్దరు బాలికలు మరణించగా.. తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. ఇది విషాదకరమైనా.. ప్రభుత్వం మరణాలకు బాధ్యత వహించదని ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
అర్హులైన వ్యక్తులు టీకా వేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించిందని, అయితే దానికి ఎలాంటి చట్టపరమైన బలవంతం లేదని అఫిడవిట్లో పేర్కొంది. అయితే, ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగస్టు 29న కేంద్రానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసింది. శప పరీక్ష, విచారణ నివేదికలను సమయానుకూలంగా విడుదల చేయడంతో పాటు మరణంపై స్వతంత్ర కమిటీతో దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు దాఖలైంది. మృతుల తల్లిదండ్రులకు పరిహారం ఇవ్వాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు.
వాక్సిన్ దుష్ప్రభావాలతో బాధపడుతున్న వ్యక్తులను ముందస్తుగా గుర్తించి చికిత్స అందించేందుకు మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రభుత్వానికి ఆదేశాలను ఇవ్వాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ప్రతి వ్యాక్సిన్‌కు ఇమ్యునైజేషన్ (AEFIలు) అనుసరించే ప్రతికూల సంఘటనలు నివేదించబడుతున్నాయని, వ్యాక్సిన్లు థర్డ్ పార్టీలతో తయారవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించిన సమాచారం పబ్లిక్ డొమైన్లో ఉచితంగా అందుబాటులో ఉందని కోర్టుకు తెలిపింది.
ఈ సందర్భంగా పిటిషనర్ల నష్ట పరిహారం డిమాండ్‌ను ఆరోగ్యమంత్రిత్వ శాఖ తోసి పుచ్చింది. వ్యాక్సినేషన్ ప్రతికూల ప్రభావాలతో వ్యక్తి శారీరకంగా గాయమైనా, మరణించినా చట్టప్రకారం అతని కుటుంబం పరిహారం కోరుతూ సివిల్ కోర్టులో దావా వేయొచ్చని. నిర్లక్ష్యానికి సంబంధించిన కేసుల వారీగా కేసు నమోదు చేయవచ్చని అఫిడవిట్ పేర్కొంది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కొలిన్ గోన్సాల్వేస్ వాదనలు వినిపిస్తూ.. వ్యాక్సిన్‌తో కలిగే నష్టాలను ముందుగానే తెలియజేసి సమ్మతి తీసుకుని ఉంటే ఈ మరణాలు సంభవించి ఉండేవి కావన్నారు.
వ్యాక్సిన్లు, మందులను స్వచ్ఛందంగా వాడేందుకు ‘సమ్మతి’ అనే ప్రశ్న వర్తించదని, మోతాకు సంబంధించి ప్రతికూల ప్రభావాలు స్వల్పంగా ఉంటాయని పేర్కొంది. ఈ నెల 19 వరకు దేశంలో 219.86కోట్ల డోసులు ఇవ్వగా.. వీటిలో 92,114 ప్రతికూల ప్రభావాల కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. ఇదిలా ఉండగా.. ఓ బాలిక గతేడాది 29న కోవిషీల్డ్ మొదటి డోసు తీసుకున్న తర్వాత జూన్ 19న మరణించింది. మరో ఎంఎస్సీ విద్యార్థిని గత ఏడాది జూన్ 18న కొవిషీల్డ్ మొదటి డోసు తీసుకోగా.. జూలై 10న కన్నుమూసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

