Sanchar Saathi | దేశంలో కొత్తగా తయారయ్యే స్మార్ట్ఫోన్లలో ఆ యాప్ తప్పనిసరి..!
Sanchar Saathi | దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలు (Cyber crimes), మొబైల్ ఫోన్ల దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం (Union Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్ఫోన్లలో 'సంచార్ సాథీ (Sanchar Sathi)' అనే ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ యాప్ (Cyber security app) ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయాలని మొబైల్ తయారీ కంపెనీలను ఆదేశించింది.
Sanchar Saathi : దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలు (Cyber crimes), మొబైల్ ఫోన్ల దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం (Union Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్ఫోన్లలో ‘సంచార్ సాథీ (Sanchar Sathi)’ అనే ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ యాప్ (Cyber security app) ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయాలని మొబైల్ తయారీ కంపెనీలను ఆదేశించింది.
ఈ యాప్‌ను వినియోగదారులు తమ ఫోన్ల నుంచి తొలగించడం సాధ్యం కాదు. ఈ మేరకు కేంద్ర టెలికామ్ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు ‘రాయిటర్స్’ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొన్నది. సైబర్ మోసాలు, ఫోన్ చోరీలు, ఐఎంఈఐ (IMEI) నంబర్ల ట్యాంపరింగ్ వంటి సమస్యలను ఎదుర్కోవడానికి కేంద్రం ఈ ఏడాది జనవరిలో ‘సంచార్ సాథీ’ పోర్టల్‌ను, యాప్‌ను ప్రారంభించింది.
దీని ద్వారా పోయిన లేదా దొంగిలించబడిన ఫోన్లను సులభంగా ట్రాక్ చేయవచ్చు. ఇప్పటివరకు ఈ యాప్ సహాయంతో సుమారు 7 లక్షల చోరీ ఫోన్లను గుర్తించి బ్లాక్ చేశారు. ఈ యాప్ సైబర్ దాడుల నుంచి వినియోగదారులను హెచ్చరించడంతో పాటు, అనధికారిక యాక్సెస్‌ను కూడా నిరోధిస్తుంది. కేంద్రం ఆదేశాల ప్రకారం.. 2025 డిసెంబర్ 1 నుంచి తయారయ్యే అన్ని స్మార్ట్ఫోన్లలో ఈ యాప్‌ను డిఫాల్ట్‌గా అందించాల్సి ఉంటుంది.
ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా దీన్ని ఇన్స్టాల్ చేయాలని సూచించారు. ఈ మార్పులను అమలు చేయడానికి మొబైల్ కంపెనీలకు 90 రోజుల సమయం ఇచ్చారు. అయితే, ప్రభుత్వ నిర్ణయంపై యాపిల్, శాంసంగ్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
ముఖ్యంగా యాపిల్ వంటి సంస్థలు తమ ఆపరేటింగ్ సిస్టమ్‌లో థర్డ్-పార్టీ యాప్‌లను డిఫాల్ట్‌గా చేర్చడానికి ఇష్టపడవు. గతంలో ఇలాంటి ప్రతిపాదనలను వ్యతిరేకించిన దాఖలాలు ఉన్నాయి. ఈ యాప్ ద్వారా సైబర్ నేరాలు 20 నుంచి 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

