న్యూఢిల్లీ : గూగుల్ మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. యూజర్ల గోప్యతకు భంగం కలగకుండా గూగుల్ నిరుడు ‘రిజల్ట్స్ అబౌట్ యు’ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజా ఫీచర్‌ను ఇప్పుడు అందులో జోడించింది. ఈ ఫీచర్‌ను ఉపయోగించి గూగుల్‌లో ఎలాంటి సెర్చ్ చేయకుండానే ఫోన్ నంబర్, అడ్రస్, ఈమెయిల్ వంటివి ఉంటే కనిపెట్టవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో కానీ, వెబ్‌లో కానీ ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. డ్యాష్‌బోర్డులో వ్యక్తిగత సమాచారం ఇవ్వగానే అలాంటి సమాచారం ఎక్కడైనా ఉందేమో క్షణాల్లోనే గూగుల్ స్కాన్ చేసి చెప్పేస్తుంది.