55 మంది ప్రయాణికులను బస్సులో వదిలేసి వెళ్లిన గోఫస్ట్ విమానం.. రూ.10 లక్షల జరిమానా
గోఫస్ట్ ఎయిర్‌లైన్ విమానం బెంగళూరు నుంచి ఢిల్లీకి టేకాఫ్ అయ్యింది. అయితే బోర్డింగ్ పాస్‌లు ఉండి, బ్యాగులు చెక్ ఇన్ చేసిన ఒక బస్సులోని 55 మంది ప్రయాణికులు ఎక్కకుండానే ఆ విమానం వెళ్లిపోయింది.
న్యూఢిల్లీ: గోఫస్ట్ ఎయిర్‌లైన్‌కు చెందిన ఒక విమానం 55 మంది ప్రయాణికులను బస్సులో వదిలేసి వెళ్లిపోయింది. ఈ సంఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం ఆ సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధించింది. ఈ నెల 9న ఉదయం 6.30 గంటలకు గోఫస్ట్ ఎయిర్‌లైన్‌కు చెందిన జీ8 116 విమానం బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి టేకాఫ్ అయ్యింది. అయితే బోర్డింగ్ పాస్‌లు ఉండి, బ్యాగులు చెక్ ఇన్ చేసిన నాలుగు బస్సుల్లో ఒక బస్సులోని 55 మంది ప్రయాణికులు ఎక్కకుండానే ఆ విమానం వెళ్లిపోయింది.
కాగా, ఈ విషయం తెలుసుకున్న డీజీసీఏ, గోఫస్ట్ ఎయిర్‌లైన్‌కు నోటీస్ పంపింది. ఈ సంఘటనతోపాటు పలు నిబంధనల ఉల్లంఘనపై వివరణ కోరింది. విమానంలోకి ప్రయాణీకులను ఎక్కించే విషయంలో టెర్మినల్ కోఆర్డినేటర్, కమర్షియల్ సిబ్బంది, విమాన సిబ్బంది మధ్య సరైన కమ్యూనికేషన్, సమన్వయం లేకపోవడంపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధించింది.
మరోవైపు బస్సులోనే వదిలేసిన 55 మంది ప్రయాణికులకు గోఫస్ట్ సంస్థ క్షమాపణలు తెలిపింది. బాధిత ప్రయాణికులు ఏడాదిలోపు దేశంలో ఎక్కడికైనా సంస్థ విమానంలో ప్రయాణించేందుకు ఒక ఉచిత టికెట్ ఇచ్చింది. అలాగే ఈ సంఘటనకు బాధ్యులైన సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bus
- DGCA
- Fine
- Go First Airline
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

