IT Layoffs | గడ్డు పరిస్థితుల్లో ఐటీ పరిశ్రమ.. గంటకు 23 మంది టెకీలకు ఉద్వాసన
ప్రపంచవ్యాప్తంగా గత రెండేండ్లుగా ఐటీ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. పలు సంస్థలు తమ సిబ్బందిని తొలగిస్తూ వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం కారణంగా ఈ పరిశ్రమ ఇంకా కోలుకోలేదు. ప్రాజెక్టులు లేకపోవడం,
IT Layoffs | ప్రపంచవ్యాప్తంగా గత రెండేండ్లుగా ఐటీ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. పలు సంస్థలు తమ సిబ్బందిని తొలగిస్తూ వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం కారణంగా ఈ పరిశ్రమ ఇంకా కోలుకోలేదు. ప్రాజెక్టులు లేకపోవడం, లాభాలు దిగజారడం వంటి పరిస్థితుల వల్ల మరింతగా ఖర్చు తగ్గించుకోవాలని భావిస్తున్న ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల తొలగింపును కొనసాగిస్తున్నాయి.
ఉద్యోగాల కోత ఇలా..
- గత రెండేండ్లలో ఉద్యోగాలు కోల్పోయిన ఐటీ ఉద్యోగులు- 4,04,962 మంది
- గంటకు 23 మంది, రోజుకు 555 మంది
2022లో..
- ఉద్యోగులను తొలగించిన కంపెనీలు- 1,061
- ఉద్యోగాలు కోల్పోయిన మొత్తం టెకీలు 1,64,769

2023లో..
- ఉద్యోగులను తొలగించిన కంపెనీలు- 1059
- ఉద్యోగాలు కోల్పోయిన టెకీలు- 2,40,193
స్టార్టప్‌ల నుంచి గూగుల్ వరకు అదే దారి
గత రెండేండ్లుగా ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియక ఐటీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి గంటకు 23 మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోతున్నట్టు ఒక నివేదిక తెలియజేసింది. లేఆఫ్.ఎఫ్‌వైఐ వెబ్సైట్ తెలియజేసిన వివరాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2,120 టెక్ కంపెనీలు నేటి వరకు 4,04,962 మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి. ఇలా తొలగిస్తున్న వాటిలో స్టార్టప్‌ల నుంచి గూగుల్ వరకు దేనికీ మినహాయింపు లేదు. వచ్చేవారంలో మరిన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తాయని వార్తలొస్తున్నాయి. యూఎస్‌కు చెందిన ప్రముఖ చిప్ తయారీ సంస్థ క్వాల్కామ్ 1,258 మందిని తీసివేయాలని యోచిస్తున్నది. అలాగే అమెరికేతర సంస్థలైన చైనాలిసిస్, ప్లెక్స్, సిస్కో, పై ఇన్సూరెన్స్‌లు వందలాది మందిని, ఎపిక్ గేమ్స్ 16 శాతం అనగా 870 మందిని ఇంటికి పంపడానికి రంగం సిద్ధం చేస్తున్నాయి.
- భారత్‌లో సుమారు 21 వేల మంది ఉద్యోగులను తొలగించిన 70 స్టార్టప్‌లు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

