భోపాల్: ఒక యువతి బిల్డింగ్ పైనుంచి దూకింది. కింద ఉన్న టెర్రస్‌పై ఆమె పడింది. (Girl Jumps Off Building) గమనించిన స్థానికులు ఆ యువతిని అక్కడ నుంచి కిందకు దించి కాపాడారు. గాయపడిన ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ సంఘటన జరిగింది. గురువారం ఇండోర్‌లోని విజయ్ నగర్ ప్రాంతంలో గోల్డెన్ గేట్ సమీపంలోని బహుళ అంతస్తులున్న బిల్డింగ్ పైనుంచి ఒక యువతి కిందకు దూకింది. ఆ భవనం కింద ఉన్న అంచుపై ఆమె పడింది. పెద్ద శబ్దం రావడంతో ఏం జరిగిందోనని స్థానికులు భయాందోళన చెందారు. టెర్రస్‌పై యువతి పడి ఉండటాన్ని వారు గమనించారు.
కాగా, కొందరు వ్యక్తులు ఆ టెర్రస్ వద్దకు చేరుకున్నారు. అక్కడ కదలలేని స్థితిలో ఉన్న యువతిని చాలా కష్టంతో కిందకు దించారు. గాయపడిన ఆమెను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆ యువతి ఎవరు అన్న వివరాలు తెలియలేదు.
మరోవైపు ఆ అమ్మాయి ఆత్మహత్య కోసం బిల్డింగ్ పైనుంచి దూకిందా లేదా ప్రమాదవశాత్తు అక్కడి నుంచి పడిందా అన్నది నిర్ధారణ కాలేదు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై ఆరా తీస్తున్నారు. కాగా, స్థానికులు ఆ యువతిని రక్షించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
इन्दौर विजयनगर क्षेत्र में बहुमंजिला बिल्डिंग से कूदी युवती….. भारी भीड़ जमा
इंदौर विजयनगर क्षेत्र के गोल्डन गेट के समीप जनसेवा आटा चक्की पर एक युवती बहुमंजिला इमारत से कूद गई । युवती जब बिल्डिंग से कूदी तो निचली मंजिल की छत पर गिरी जिसे लोगों ने कड़ी मशक्कत बाद उतारा और… pic.twitter.com/XNM74tTUCK
— Global Bharat News (@Global__Bharat) October 17, 2024