ఓవైపు అంతర్జాతీయంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ట్రెండింగ్‌లో ఉంటే.. మరోవైపు కచ్చాబాదమ్ సాంగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ కాచ్చా బాదమ్ సాంగ్ మీదనే పడ్డారు. కచ్చా బాదమ్ సాంగ్‌కు డ్యాన్స్ చేయడం.. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం.. ఇదే పని. సెలబ్రిటీలకు కూడా ఈ సాంగ్ పిచ్చిపిచ్చిగా నచ్చేయడంతో ఈ పాటకు ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. ఈ పాటను పాడిన భుబన్ బద్యాకర్ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.
Cutest ‘कच्चा बादाम’ ❤️ pic.twitter.com/YRln8CNA4X
— Awanish Sharan (@AwanishSharan) March 13, 2022
తాజాగా ఈ పాటకు ఓ చిన్నారి డ్యాన్స్ వేసింది. స్కూల్ డ్రెస్సులో.. స్కూల్లోనే ఈ చిన్నారి వేసిన డ్యాన్స్ చూస్తే ఫిదా కావాల్సిందే. ఈ వీడియోను ఐఏఎస్ ఆఫీసర్ అవానిష్ శరణ్ క్యూటెస్ట్ కచ్చా బాదమ్ అంటూ క్యాప్షన్ పెట్టి ఈ వీడియోను షేర్ చేశాడు. అది అంగన్వాడీ సెంటర్లా ఉంది. స్కూల్ డ్రెస్సులో ముద్దు ముద్దుగా ఉన్న ఆ చిన్నారి.. కచ్చా బాదమ్ స్టెప్పులను దింపేసింది. దీంతో నెటిజన్లు డ్యాన్స్ చూసి వావ్.. ఎంత క్యూట్‌గా డ్యాన్స్ చేశావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.