పార్టీ పేరు ప్రకటించనున్న గులాం నబీ ఆజాద్!
Ghulam Nabi Azad | జమ్ముకశ్మీర్‌లో మరో రాజకీయ పార్టీ పురుడుపోసుకోనుంది. కాంగ్రెస్ పార్టీతో ఐదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) నేతృత్వంలో పార్టీ
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరో రాజకీయ పార్టీ పురుడుపోసుకోనుంది. కాంగ్రెస్ పార్టీతో ఐదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) నేతృత్వంలో పార్టీ ప్రారంభంకానుంది. నేడు పార్టీ పేరు, దానికి సంబంధించిన విధివిధానాలను ఆజాద్ ప్రకటించే అవకాశం ఉన్నది. సోమవారం మధ్యాహ్నం మీడియా వేదికగా పార్టీ పేరును వెల్లడించనున్నారు.
కాగా, జాతీయ పార్టీనే ప్రకటిస్తారని తెలుస్తున్నది. అయితే ముందుగా జమ్ముకశ్మీర్‌తో ప్రారంభించి ఆ తర్వాత మిగతా రాష్ట్రాలకు విస్తరించబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో కశ్మీర్లో ఒంటరిగా పోటీచేయనున్న ఆయన.. ఇతర పార్టీలతో కలిసి అధికారాన్ని పంచుకోనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశారు.
గతనెలలో ఆజాద్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్‌కు పార్టీ నడిపే సామర్థ్యం లేదని విరుచుకుపడ్డారు. పార్టీలో మారిన పరిస్థితులే తన రాజీనామాకు కారణమని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

